గ్రేటర్ విశాఖలో వైసీపీకి షాక్..
ABN, Publish Date - Aug 08 , 2024 | 10:22 AM
విశాఖ: మహానగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 10 స్థానాలను కూటమి అభ్యర్థులు కైవశం చేసుకున్నారు. జీవీఎంసీలో పూర్తి స్థాయి మెజారిటీ కలిగిన వైసీపీ నేతలకు ఈ పరిణామం షాకిచ్చింది. జీవీఎంసీలో మొత్తం 98 మంది కార్పొరేటర్లకుగానూ.. ఒకరు రాజీనామా చేయడంతో ప్రస్తుతం 97 మంది ఉన్నారు.
విశాఖ: మహానగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 10 స్థానాలను కూటమి అభ్యర్థులు కైవశం చేసుకున్నారు. జీవీఎంసీలో పూర్తి స్థాయి మెజారిటీ కలిగిన వైసీపీ నేతలకు ఈ పరిణామం షాకిచ్చింది. జీవీఎంసీలో మొత్తం 98 మంది కార్పొరేటర్లకుగానూ.. ఒకరు రాజీనామా చేయడంతో ప్రస్తుతం 97 మంది ఉన్నారు. పీపీఎం కార్పొరేటర్ గంగారావు ఓటింగ్‌కు దూరంగా ఉండడంతో 96 మంది మాత్రమే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కూటమి తరఫున 10 మంది.. వైసీపీ నుంచి 10 మంది పోటీకి దిగారు.
జీవీఎంసీ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత మూడుసార్లు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగ్గా, వైసీపీ క్లీన్‌స్వీప్ చేస్తూ వచ్చింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘనవిజయం సాధించడంతో జీవీఎంసీలో సమీకరణాలు మారిపోయాయి. జీవీఎంసీలో మొత్తం 98 మంది కార్పొరేటర్లగానూ వైసీపీ నుంచి 21వ వార్డు కార్పొరేటర్‌గా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ తనపదవికి, వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. దీంతో ప్రస్తుతం 97 మంది కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. పాత స్టాండింగ్ కమిటీ సభ్యుల పదవీకాలం గత నెలతో ముగియడంతో కొత్తగా కమిటీని ఎన్నుకునేందుకు గతనెల 22న నోటిఫికేషన్ విడుదల చేశారు. కూటమి తరఫున పది మంది, వైసీపీ నుంచి పది మంది పోటీకి నిలిచారు.
నోటిఫికేషన్ విడుదలైన సమయానికి టీడీపీకి 31, జనసేనకు ఐదు, బీజేపీకి ఒకరు మొత్తంగా కూటమికి 37 మంది కార్పొరేటర్ల బలం ఉండగా.. వైసీపీకి 58 మంది సభ్యుల బలం ఉండేది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వైసీపీ నుంచి ఆరుగురు టీడీపీలోకి ఐదుగురు జనసేనలోకి చేరిపోయారు. వైసీపీకి ఇంతకాలం మద్దతుగా నిలిచిన ఇండిపెండెంట్ కార్పొరేటర్ అప్పారి శ్రీవిద్య టీడీపీకి మద్దతు ప్రకటించారు. దీంతో కూటమి బలం 49కి పెరగ్గా, వైసీపీ బలం 47కి తగ్గింది. పోలింగ్‌కు ముందురోజైన మంగళవారం వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి కార్పొరేటర్లతో ఒక హోటల్‌లో క్యాంప్ ఏర్పాటుచేశారు. ఈ క్యాంప్‌నకు నలుగురు కార్పొరేటర్లు డుమ్మా కొట్టడంతో వారంతా కూటమికి మద్దతు ప్రకటిస్తారని వైసీపీ నేతలు అంచనాకు వచ్చారు. బుధవారం పోలింగ్ ప్రారంభమైన తర్వాత వైసీపీ కార్పొరేటర్లు ముందుగా జీవీఎంసీలోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. తర్వాత వైసీపీ క్యాంప్‌నకు గైర్హాజరైన నలుగురు కార్పొరేటర్లు కూటమి కార్పొరేటర్లతో కలిసి బస్సులో జీవీఎంసీకి చేరుకోవడంతో వైసీపీ నేతలు అవాక్కయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంకా వైసీపీ మత్తులోనే కొందరు అధికారులు..
క్యూఆర్ కోడ్‌తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు..
ప్రకాశం బ్యారేజికు భారీగా వరద నీరు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 08 , 2024 | 10:22 AM