ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లడ్డూ విచారణలో బయటపడ్డ కీలక నిజాలు..!

ABN, Publish Date - Sep 29 , 2024 | 03:18 PM

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్.. తన దర్యాప్తును ముమ్మరం చేసింది. అందులోభాగంగా ఆదివారం ఉదయం టీటీడీ ఉన్నతాధికారులతో సిట్ సమావేశం కావాలని ముందుగా నిర్ణయించింది.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్.. తన దర్యాప్తును ముమ్మరం చేసింది. అందులోభాగంగా ఆదివారం ఉదయం టీటీడీ ఉన్నతాధికారులతో సిట్ సమావేశం కావాలని ముందుగా నిర్ణయించింది. కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ రోజు తిరుమల పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం టీటీడీ ఉన్నతాధికారులంతా సీజేఐను ఆహ్వానించేందుకు వెళ్ల వలసి ఉంది.


ఈ నేపథ్యంలో టీటీడీ ఉన్నతాధికారులతో సిట్ భేటీ వాయిదా పడింది. అయితే శనివారం తిరుమలకు చేరుకున్న సిట్ అధికారుల బృందం.. స్వామి వారిని దర్శించుకుంది. అనంతరం పలువురు టీటీడీ ఉన్నతాధికారులతో ఐపీఎస్ అధికారి సర్వ శ్రేష్టి త్రిపాఠి నేతృత్వంలో సిట్ అధికారుల బృందం సమావేశమైంది.


దానికి కొనసాగింపుగా ఆదివారం ఉదయం భేటీ కావాల్సి ఉంది. కానీ వాయిదా పడింది. దాంతో కల్తీ నెయ్యి వ్యవహారంలో టీటీడీ అధికారులకు ఏ ఏ ప్రశ్నలు సంధించాలి అనే అంశాలను సిట్ అధికారులు బృందం రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని తెలుస్తుంది.

Updated Date - Sep 29 , 2024 | 03:20 PM