ఈ చాయ్ షుగర్ ఉన్నవాళ్లు కూడా తాగొచ్చు..
ABN, Publish Date - Oct 24 , 2024 | 12:48 PM
మంచిర్యాల జిల్లా కేంద్రంలో లభిస్తున్న సరికొత్త టీ, కాఫీలు అక్కడ స్థానికుల మనసులు దోచేస్తున్నాయి. దశాబ్దం క్రితం వరకు సాధారణ ఛాయ్, స్పెషల్ ఛాయ్‌లు మాత్రమే ఇక్కడ ప్రజలకు తెలుసు. ప్రస్తుతం రకరకాల ఫ్లేవర్స్‌లలో ఛాయ్‌లు అందుబాటులోకి వచ్చాయి.
మంచిర్యాల: ఒకప్పుడు ‘టీ’ అంటే ఒకే రకంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. రకరకాల ఫేవర్లతో చాయ్ అందుబాటులోకి వచ్చింది. అందుకు తగ్గట్టు.. కొత్త కొత్త పేర్లతో టీ స్టాల్స్ పుట్టుకు వస్తున్నాయి. కార్పొరేట్ లుక్స్‌తో టీ స్టాల్స్ అదరగొడుతున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో లభిస్తున్న సరికొత్త టీ కాఫీలు అక్కడ స్థానికుల మనసులు దోచేస్తున్నాయి. దశాబ్దం క్రితం వరకు సాధారణ ఛాయ్, స్పెషల్ ఛాయ్‌లు మాత్రమే ఇక్కడ ప్రజలకు తెలుసు. ప్రస్తుతం రకరకాల ఫ్లేవర్స్‌లలో ఛాయ్‌లు అందుబాటులోకి వచ్చాయి. రూ. 10 నుంచి రూ. వంద వరకు ధరల్లో లభిస్తున్నాయి. ధర ఎక్కువైనా సరే వివిధ రకాల రుచుల్లో లభిస్తు్ండడంతో ఎంతో ఇష్టంగా తాగేస్తున్నారు.
ఇటీవల మంచిర్యాలలో బెల్లం టీ స్టాల్ ఏర్పాటు చేశారు. దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. స్థానికులతోపాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు సయితం ఈ బెల్లం చాయ్ తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. బెల్లం టీలో రకరకాల ఫ్లేవర్లు అందిస్తున్నామని నిర్వాహకులు చెబుతుండగా.. ఆరోగ్యానికి బెల్లం మంచిది కాబట్టి తాగుతున్నామని కష్టమర్లు అంటున్నారు. ఈ బెల్లం చాయ్‌కు క్యూ కడుతున్నారు. షుగర్ ఉన్నవాళ్లు కూడా ఈ చాయ్ తాగవచ్చు..
ఈ వార్తలు కూడా చదవండి..
విజయసాయిరెడ్డి కుమార్తె కేసు..
రెండు రోజుల్లో ఏం జరుగుతుందో మీరే చూస్తారు
ఆందోళనలో రేవంత్ రెడ్డి సర్కార్..
ఉగ్రవాదంపై పీఎం మోదీ కీలక వ్యాఖ్యలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 24 , 2024 | 12:50 PM