లగచర్లకు ఎంపీ డీకే అరుణ.. ఇంతలోనే
ABN, Publish Date - Nov 13 , 2024 | 03:47 PM
Telangana: పట్నం నరేందర్ రెడ్డికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఆయన తరపు న్యాయవాది చెప్పారు. ఈ ఘటనలో మొత్తం 55 మందిని గుర్తించారు. అందులో నిన్న 16 మందిని జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ రోజు (బుధవారం) పట్నం నరేందర్ రెడ్డితో సహా ఐదు మందిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.
వికారాబాద్, నవంబర్ 13: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని (Former MLA Patnam Narender Reddy) పోలీసులు వికారాబాద్ డీటీసీ నుంచి పరిగి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వికారాబాద్‌లో నరేందర్ రెడ్డిని ఐజీ సత్యనారాయణ, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి విచారించనున్నారు. నరేందర్ రెడ్డికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఆయన తరపు న్యాయవాది చెప్పారు. ఈ ఘటనలో మొత్తం 55 మందిని గుర్తించారు. అందులో నిన్న 16 మందిని జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ రోజు (బుధవారం) పట్నం నరేందర్ రెడ్డితో సహా ఐదు మందిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. పరారీలో ఉన్న వారి కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న సురేష్ కూడా పరారీలో ఉన్నాడు.
మరోవైపు లగచర్ల వెళ్తుండగా ఎంపీ డీకే అరుణను పోలీసులు అడ్డుకున్నారు. మన్నెగూడ జనగాం దారిలో డీకే అరుణ వాహనాన్ని పోలీసులు ఆపేశారు. పోలీసుల తీరుపై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా తన నియోజకవర్గంలో పర్యటించే హక్కు లేదా అని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి...
BRS: పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై బీఆర్‌ఎస్ కీలక నేతలు ఏమన్నారంటే
Read Latest Telangana News ANd Telugu News
Updated Date - Nov 13 , 2024 | 03:47 PM