బీఆర్ఎస్ హయాంలోనే మాయ చేసిన మిల్లర్లు
ABN, Publish Date - May 29 , 2024 | 09:13 AM
హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైస్ మిల్లర్లు చేసిన మాయాజాలం బట్టబయలైంది. గత ఏడాది యాసంగి సీజన్‌లో ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఆ చార్జీలు, ఉప ఉత్పత్తులు తీసుకువచ్చి బియ్యాన్ని ఎఫ్‌సీఐకు అప్పగించాల్సిన రైస్ మిల్లర్లు గుడిని, గుడిలోని లింగాన్ని మింగినట్లు..
హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైస్ మిల్లర్లు చేసిన మాయాజాలం బట్టబయలైంది. గత ఏడాది యాసంగి సీజన్‌లో ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఆ చార్జీలు, ఉప ఉత్పత్తులు తీసుకువచ్చి బియ్యాన్ని ఎఫ్‌సీఐకు అప్పగించాల్సిన రైస్ మిల్లర్లు గుడిని, గుడిలోని లింగాన్ని మింగినట్లు ఏకంగా ఆ ధాన్యంలో అధిక భాగాన్ని బహిరంగ మార్కెట్‌లో అమ్ముకున్నారు. తాజాగా టెండర్లు ఖరారు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితమే ప్రభుత్వమిచ్చిన ధాన్యాన్ని ఇచ్చినట్లుగా అమ్ముకున్న మిల్లర్లు.. ఇప్పుడు టెండర్ ఏజెన్సీలకు వడ్లు అప్పగించడానికి గగ్గోలు పెడుతున్నారు. గత ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పుడు ఎన్ఎఫ్‌సీ కంటే తక్కువ ధర రాగా.. ఈ ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఏజెన్సీలు ఎక్కువ ధర కోడ్ చేయడం రైస్ మిల్లర్లకు మింగుడు పడడంలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - May 29 , 2024 | 09:13 AM