ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎంకు తలపోటుగా ఆ నియోజకవర్గం..!

ABN, Publish Date - Aug 01 , 2024 | 08:31 AM

నల్గొండ: కాంగ్రెస్ అంటేనే గ్రూపులు.. ఆ పార్టీ నేతలు సై అంటే సై అంటూ కాలు దువ్వుతూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణలోని ఆ నియోజక వర్గంలో అదే సీను ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఓ మాజీ మంత్రి.. టిక్కెట్ ఆశించి భంగపడిన మరో నేత మధ్య ఆదిపత్యపోరు సాగుతోంది.

నల్గొండ: కాంగ్రెస్ అంటేనే గ్రూపులు.. ఆ పార్టీ నేతలు సై అంటే సై అంటూ కాలు దువ్వుతూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణలోని ఆ నియోజక వర్గంలో అదే సీను ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఓ మాజీ మంత్రి.. టిక్కెట్ ఆశించి భంగపడిన మరో నేత మధ్య ఆదిపత్యపోరు సాగుతోంది. ఆ ఇద్దరి నేతల గ్రూప్ పొలిటిక్స్‌తో కేడర్ టెన్షన్ పడుతుందా? ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ అధినాయకత్వానికి తలనొప్పిగా తయారయ్యారా? డ్యామేజ్ కంట్రోల్ చర్యలు తీసుకోకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నష్టం తప్పదా? ఇంతకూ ఎవరా నేతలు? ఏ నియోజక వర్గం?


2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధించింది. మొత్తం 12 నియోజకవర్గాల్లో ఒక్క సూర్యాపేట స్థానంలోనే హస్తం పార్టీ ఓడిపోయింది. ఈ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి పోటీ చేశారు. జగదీష్ రెడ్డి 4 వేల ఓట్ల మెజారిటీతో మూడో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2018, 2023 ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ టిక్కెట్ కోసం మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి, ప్రస్తుత టూరిజం కార్పోరేషన్ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌ రెడ్డి టికెట్ కోసం పోటీపడ్డారు. టికెట్‌ కేటాయింపు విషయంలో జాప్యం జరిగి చివరి నిమిషంలో కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్న రాంరెడ్డి దామోదర్‌ రెడ్డికే టికెట్‌ దక్కింది. చివరకు స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి ఓటమి చెందడం సాధారణం అంశంగా మారిపోయింది. అయితే ప్యూచర్ పాలిటిక్స్‌పై దృష్టిపెట్టి గతంలో జరిగిన పొరపాట్లను అధిగమించేందుకు రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి కొత్త పంథాలో ముందుకు పోతున్నారు. నిత్యం ప్రజల్లోకి పోతూ ప్రజా దర్భార్ నిర్వహిస్తున్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు ప్రతి వార్డుల్లో పర్యటిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ వారికి అభయమిస్తున్నారు.

Updated Date - Aug 01 , 2024 | 08:31 AM

Advertising
Advertising