సల్మాన్ ఖాన్‌కు దుండగుల బెదిరింపు..
ABN, Publish Date - Oct 18 , 2024 | 10:52 AM
ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను వాట్సాప్‌లో దుండగులు బెదిరించారు. ముంబై ట్రాఫిక్ పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ మెసేజ్ చేశారు. రూ. 5 కోట్లు ఇవ్వకుంటే సల్మాన్‌ను చంపేస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ కంటే దారుణంగా చంపుతామని వార్నింగ్ ఇచ్చారు.
ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను వాట్సాప్‌లో దుండగులు బెదిరించారు. ముంబై ట్రాఫిక్ పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ మెసేజ్ చేశారు. రూ. 5 కోట్లు ఇవ్వకుంటే సల్మాన్‌ను చంపేస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ కంటే దారుణంగా చంపుతామని వార్నింగ్ ఇచ్చారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే తాము అడిగిన డబ్బు ఇవ్వాలంటూ ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. ఈ మెసేజ్‌పై పోలీసులు విచారణ చేస్తున్నారు.
బిష్ణోయ్ సామాజిక వర్గం ఆరాధించే రెండు కృష్ణ జింకలను వేటాడి చంపినప్పటి నుంచి సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేసుకుంది బిష్ణోయి గ్యాంగ్. దీని కారణంగానే ఆ గ్యాంగ్ సల్మాన్‌ను హతమార్చేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఇటీవల ఏప్రిల్‌లో ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై వచ్చి ముంబైలోని సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నన్ను క్షమించండి.. రోహిత్ శర్మ
రాజమన్నార్ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న చిన వెంకన్న
నాంపల్లి కోర్టుకు వెళ్లనున్న కేటీఆర్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 18 , 2024 | 10:52 AM