ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమరావతికి నిధులపై త్రైపాక్షిక చర్చలు ..

ABN, Publish Date - Nov 11 , 2024 | 09:35 AM

రాజధాని అమరవతికి నిధుల ప్రతిపాదనపై సోమవారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ సమక్షంలో రాష్ట్రానికి, బ్యాంకుల ప్రతినిధులకు మధ్య త్రైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలకు రాష్ట్రం నుంచి సీఆర్‌డీఏ కమిషనర్‌ కె. భాస్కర్‌, ఏడీసీఎల్‌ సీఎండీ లక్ష్మీ పార్థసారథి, ఆర్థిక శాఖ నుంచి డి. సురేంద్ర హాజరుకానున్నారు.

అమరావతి: నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి అభివృద్ధికి (Amaravati Development) ముందడుగు పడింది. రాజధాని నిర్మాణంలో కీలకమైన అమరావతి నగర సుస్థిరాభివృద్ధి, నిర్మాణాల కోసం ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ (ADB)) నుంచి తీసుకుంటున్న రూ.15,000 కోట్ల రుణ వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా రుణ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.


మరోవైపు నిధుల ప్రతిపాదనపై సోమవారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ సమక్షంలో రాష్ట్రానికి, బ్యాంకుల ప్రతినిధులకు మధ్య త్రైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలకు రాష్ట్రం నుంచి సీఆర్‌డీఏ కమిషనర్‌ కె. భాస్కర్‌, ఏడీసీఎల్‌ సీఎండీ లక్ష్మీ పార్థసారథి, ఆర్థిక శాఖ నుంచి డి. సురేంద్ర హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఈ రూ.15,000 కోట్ల రుణానికి సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలు ఖరారు కానున్నాయి.

రుణంపై మారటోరియం సమయం, కాలపరిమితి వంటి విషయాల్లో స్పష్టత రానుంది. ఈ నిధులలో 800 బిలియన్‌ డాలర్లను ప్రపంచబ్యాంకు, 800 బిలియన్‌ డాలర్లను ఏడీబీ సమకూర్చనున్నాయి. చర్చల అనంతరం విడతల వారీగా నిధులు రాష్ట్రానికి అందనున్నాయి. ఈ నిధుల నిర్వహణ కోసం ప్రత్యేక బడ్జెట్‌ హెడ్‌ ఏర్పాటు చేస్తారు. ఏపీసీఆర్‌డీఏ సమర్పించే బిల్లులకు ఈ హెడ్‌ ద్వారాను సీఎఫ్ఎంఎస్‌ నుంచి నిధులు చెల్లిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి నిధులు సమకూర్చుకునేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు ప్రభుత్వం అధికారం కల్పించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కొత్త ప్యాలస్ నిర్మాణంలో ఆ ఇద్దరితే కీలక పాత్ర..

కార్తీక మాసం.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు

సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

అహంకారం.. ఆర్భాటం వద్దు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 11 , 2024 | 09:38 AM