ఏపీలో రెండు షాకింగ్ ఘటనలు..
ABN, Publish Date - Jul 23 , 2024 | 08:16 AM
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం రెండు షాకింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకటి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులు దుండగులు తగులబెట్టారు. నిజానికి కాలిపోయాయి అని కూడా అనవచ్చు. అయితే ఉద్దేశపూర్వకంగా దుండగులు తగులబెట్టారని తెలుస్తోంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం రెండు షాకింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకటి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులు దుండగులు తగులబెట్టారు. నిజానికి కాలిపోయాయి అని కూడా అనవచ్చు. అయితే ఉద్దేశపూర్వకంగా దుండగులు తగులబెట్టారని తెలుస్తోంది. కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణం కాదని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. ఇక... అసలు ‘కుట్ర’ ఏమిటో బయటపడాల్సి ఉంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన భూముల వ్యవహారాలతో ముడిపడిన ఫైళ్లు అక్కడే ఉండటం... అత్యంత కీలకమైన నిషేధిత భూముల జాబితా సెక్షన్‌లోనే అగ్గి రాజుకోవడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ సంఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ సోమవారం మధ్యాహ్నం సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మూడు గంటల పాటు సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. ఇది ప్ర మాదం కాదు.. ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన సంఘటనగా తేల్చారు.
ఎవరూ ఊహించని విధంగా రెండో ఘటన జరిగింది. నిన్న మొన్నటి వరకు జగన్‌ను తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన రఘురామ కృష్ణంరాజు అసెంబ్లీలో ఇద్దరూ కౌగిలించుకున్నంతపనైంది. ఒకరికొకరు పలుకరించుకుని షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో తెలియదు. ఈ ఘటన ప్రజలకు షాకిచ్చింది. ఇది ఏపీలో పెద్ద వార్తయింది. ఇక్కడ ఇంకొక ట్విట్టు ఏంటంటే.. ఆర్థిక మంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌తో మాట్లాడుతూ తనకు జగన్ ప్రక్కన కూర్చొనే సీటు ఇవ్వాలని రఘురామ కోరారు. ఇది జగన్‌కే పెద్ద షాకయి ఉండవచ్చు.
Updated Date - Jul 23 , 2024 | 08:16 AM