అమెరికాలో జగన్ ఊచలు లెక్కపెట్టడం ఖాయం..
ABN, Publish Date - Nov 24 , 2024 | 09:56 PM
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లపాటు జగన్ అడ్డగోలుగా పాలన చేశారు. సంక్షేమం పేరు చెప్పి వేల కోట్లు దోపిడీ చేశారు. ప్రజలు ఎలా పోతే మనకెందుకు, మనం కోట్ల రూపాయలు దోచేసి మరిన్ని కోటలు కట్టేయెుచ్చని భావించారు.
అమరావతి: దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లపాటు జగన్ అడ్డగోలుగా పాలన చేశారు. సంక్షేమం పేరు చెప్పి వేల కోట్లు దోపిడీ చేశారు. ప్రజలు ఎలా పోతే మనకెందుకు, మనం కోట్ల రూపాయలు దోచేసి మరిన్ని కోటలు కట్టేయెుచ్చని భావించారు. ఇందులో భాగంగానే అదానీతో విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి రూ.1,750 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. జగన్ తరహాలో ఇతర రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రీ ఇంత అడ్డగోలుగా ఒప్పందాలు చేసుకోలేదు. జగన్ ధన దాహం కారణంగా ప్రజలపై రూ.17వేల కోట్ల విద్యుత్ భారం పడింది. చేయాల్సిందంతా చేసి తనకేమీ తెలియదన్నట్లు జగన్, వైసీపీ నేతలు విద్యుత్ ఛార్జీలు తగ్గించరా? అంటూ చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. అదానీ, జగన్ మధ్య జరిగిన చీకటి ఒప్పందాలు, కోట్ల రూపాయలు చేతులు మారిన వైనం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగల్లా ఎక్కడి వారు అక్కడ సైలెంట్ అయిపోయారు.
Updated Date - Nov 24 , 2024 | 09:56 PM