ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విదేశాలకు వెంకట్ రెడ్డి పరార్..

ABN, Publish Date - Sep 16 , 2024 | 11:43 AM

అమరావతి: ఊహించిందే జరిగింది. గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి విదేశాలకు పరారయ్యారు. ఇసుక కాంట్రాక్టులో అవినీతి అక్రమాల కేసులో ఆయన కోసం ఏసీబీ గత రెండు, మూడు రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ కనిపెట్టలేకపోయింది.

అమరావతి: ఊహించిందే జరిగింది. గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి విదేశాలకు పరారయ్యారు. ఇసుక కాంట్రాక్టులో అవినీతి అక్రమాల కేసులో ఆయన కోసం ఏసీబీ గత రెండు, మూడు రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ కనిపెట్టలేకపోయింది. అంతకుముందే వెంకట్ రెడ్డి విదేశాలకు పారిపోయినట్లు తాజాగా వెలుగుచూసింది. ఇసుక అక్రమాల కేసులో ప్రభుత్వం, ఏసీబీ అన్ని శుభముహూర్తాలు చూసుకునే సరికి అసలు నిందితుడి వాళ్ల కళ్లుగప్పి జారుకున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆయన కోసం విదేశాల్లో వెతుకుతుందా? ఇంకేం చర్యలు తీసుకుంటుందన్న చర్చ నడుస్తోంది.


ప్రభుత్వ అలసత్వం, సకాలంలో కేసును కొలిక్కి తీసుకురాలేకపోవడం వల్లే వెంకట్ రెడ్డి ముందుగానే తన దారి చూసుకున్నారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి డిప్యూటేషన్‌పై వచ్చిన ఆయన ముందు విద్యాశాఖలో పని చేశారు. తర్వాత గనులశాఖ డైరెక్టరుగా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఇసుక అమ్మకం, కాంట్రాక్టు టెండర్ల నిర్వహణతోపాటు అనేకానేక అంశాల్లో వెంకట్ రెడ్డి కేంద్రంగా అవినీతి, అక్రమాలు జరిగాయని కొత్త ప్రభుత్వం భావించింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడో రోజే జూన్ 7న ఆయనపై బదిలీవేటు వేసింది. తదుపరి పోస్టు కోసం జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీంతో ఆయన విజయవాడ విడిచి వెళ్లారు. జులై 31న వెంకట్ రెడ్డి డిప్యుటేషన్ గడువు ముగిసింది. సర్కార్ అప్పటికప్పుడు మేల్కోని అదే రోజున ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Updated Date - Sep 16 , 2024 | 11:43 AM

Advertising
Advertising