సొంతగా వంతెన కట్టిన గ్రామస్తులు..
ABN, Publish Date - Nov 04 , 2024 | 01:00 PM
బీహార్‌లోని ముజఫర్‌పూర్ నుంచి భాగమతి నిదీ ప్రవహిస్తుంది. అయితే ముజఫర్‌పూర్ గ్రామస్తులు ప్రక్క గ్రామానికి వెళ్లాలంటే ఖచ్చితంగా నదిని దాటాల్సిందే. దాంతో తమకు బ్రిడ్జీ అవసరముందని.. దాన్ని నిర్మించాలంటూ అధికారులు ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించుకున్నారు. కానీ ప్రభుత్వం, అధికారులు పట్టించుకోలేదు.
బీహార్: కొన్ని గ్రామాలకు రాకపోకలు సాగేందుకు బ్రిడ్జీలు కీలకంగా పనిచేస్తాయి. అయితే మారు మూల గ్రామాల్లో వంతెనల సదుపాయం ఉండడం గగనమే. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూనే నదులు, వాగులు దాటుతుంటారు. ఇలాంటి సమయాల్లో ప్రమాదాలు జరుగుతుంటాయి. కొందరి ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక ఏ అర్ధరాత్రో ఆరోగ్యం బాగోలేక ఎమర్జన్సీగా ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తే అంతే సంగతులు. ఒక్క బ్రిడ్జి ఉంటే మాత్రం పరిస్థితులు మరోలా ఉంటాయి. అయితే ఇలా బ్రిడ్జి అత్యవసరమైన బీహార్‌లోని ఓ గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కానీ తమ సమస్యను ఎవరూ తీర్చలేదు. దాంతో తమ కష్టాన్ని తామే తీర్చుకునేందుకు నడుం బిగించారు. గ్రామస్తులంతా కలిసి భాగమతి నదిపై అద్భుతమైన బ్రిడ్జిని నిర్మించుకున్నారు.
బీహార్‌లోని ముజఫర్‌పూర్ నుంచి భాగమతి నిదీ ప్రవహిస్తుంది. అయితే ముజఫర్‌పూర్ గ్రామస్తులు ప్రక్క గ్రామానికి వెళ్లాలంటే ఖచ్చితంగా నదిని దాటాల్సిందే. దాంతో తమకు బ్రిడ్జీ అవసరముందని.. దాన్ని నిర్మించాలంటూ అధికారులు ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించుకున్నారు. కానీ ప్రభుత్వం, అధికారులు పట్టించుకోలేదు. అదిగో ఇస్తున్నాం.. ఇదిగో చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు. ఏళ్లు గడిచాయి.. ప్రభుత్వాలు మారాయి. కానీ తమ తలరాత మారలేదు. ఎమర్జన్సీ సమయాల్లో నది దాటుతూ కొందరు ప్రాణాలు కోల్పోయారు కూడా. అంతేకాదు ఈ గ్రామంలో అమ్మాయిలు, అబ్బాయిలకు నది దాటే సమస్య ఉండడంవల్ల వివాహాలు జరగడంలేదు. రాకపోకలు సవ్యంగా ఉండవని వెనుకంజ వేస్తున్నారు. దాంతో గ్రామస్తులు ఏకగ్రీవంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అంతా కలిసి తాము ఒక బ్రిడ్జిని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అవసరమైన డబ్బును చందాలుగా వేసుకుని బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శివాలయానికి పోటెత్తిన భక్తులు..
మాజీ సర్పంచ్‌ల అరెస్టులను ఖండిస్తున్న.. : హరీష్‌రావు
సోమవారం పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యాటన..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 04 , 2024 | 01:00 PM