ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తగ్గిపోతున్న రాబందులు..

ABN, Publish Date - Dec 11 , 2024 | 11:55 AM

రాబందుల రెక్కల చప్పుడు వినిపించడం క్రమంగా తగ్గిపోతోంది. గత 20 ఏళ్లలో దేశ వ్యాప్తంగా సుమారు 4 కోట్ల రాబందులు మరణించినట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. తెలంగాణలోనూ ఇవి కనుమరుగు అయ్యే పరిస్థితి ఏర్పడింది.

ABN Internet: రాబందుల రెక్కల చప్పుడు వినిపించడం క్రమంగా తగ్గిపోతోంది. వాటి సంతతి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. మానవాళికి పరోక్షంగా సాయపడే ఒక జీవి ఉనికి ప్రమాదంలో పడితే అది దీర్ఘాకలిక నష్టానికి కారణమవుతుందన్న ఆందోళన కనిపిస్తోంది. ప్రకృతిలో సహజసిద్ధంగా పారిశుధ్య కార్మికుల్లా పరోక్ష సేవలందించే జీవులైన రాబందులు జాడ లేకుండా పోతున్నాయి. మరణించిన జంతువుల కళేబరాలను తింటూ వ్యాధుల వ్యాప్తిని అడ్డుకుంటూ పరోక్షంగా మనుషులకు మేలు చేసే ఈ పక్షుల సంఖ్య అత్యంత వేగంగా తగ్గిపోతుంది. గత 20 ఏళ్లలో దేశ వ్యాప్తంగా సుమారు 4 కోట్ల రాబందులు మరణించినట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. తెలంగాణలోనూ ఇవి కనుమరుగు అయ్యే పరిస్థితి ఏర్పడింది. రాబందులకు అవాసంగా ఉన్న కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని పెంచికలపేట మండలం అటవీప్రాంతంలోని పాలరాపుగుట్టపై మూడు నెలలుగా రాబందుల జాడ కనిపించడం లేదు.


కొమురంభీం జిల్లాలోని ప్రాణహిత, పెద్దవాగు సంగమ తీరాన 300 మీటర్ల ఎత్తులో ఉన్న పాలరాపు గుట్ట ఒకప్పుడు రాబందులకు స్థావరంగా ఉండేది. 2013లో అప్పటి అటవీ అధికారులు ఈ గుట్టపై రాబందుల ఉనికిని గుర్తించి సంరక్షణ చర్యలు చేపట్టారు. రెండ్రోజులకు ఒకసారి పాలరావు గుట్ట వద్ద ఓ పశు కళేబరాన్ని రాబందులకు ఆహారంగా ఉంచేవారు. ఈ క్రమంలో వాటి సంతతి కూడా పెరిగింది. ఒక దశలో ఇక్కడ గరిష్టంగా 37 రాబందులు ఉండేవి. ఇప్పుడు ఒక్కటీ కనిపించడం లేదు. మహారాష్ట్రకు వలస వెళ్లాయని అటవీ శాఖ వర్గాలు చెబుతున్నా.. ఇక్కడి రాబందుల రకం జాతులు అక్కడ లేవని నిపుణులు చెబుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

పేదలకు చెక్కులను అందజేసిన మంత్రి నిమ్మల

జగన్‌ పాపాలపై ఫిర్యాదుల వెల్లువ

అమరావతిపై 45 శాతం అదనపు భారం

శిక్షణ తరగతులను బహిష్కరించిన బీఆర్ఎస్

ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 11 , 2024 | 11:55 AM