ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మా భూములు మాకు కావాలి.. తిరగబడ్డ జనం

ABN, Publish Date - Jul 26 , 2024 | 07:47 AM

చిత్తూరు జిల్లా: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దగ్దమైన నేపథ్యంలో భూ బాధితులు రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియాను కలిసి ఫిర్యాదు చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. బాధితుల నుంచి సిసోడియా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. తమ భూములకు సంబంధించిన రికార్డులు తారుమారు చేసి భూ కబ్జా చేయడం జరిగిందని...

చిత్తూరు జిల్లా: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దగ్దమైన నేపథ్యంలో భూ బాధితులు రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియాను కలిసి ఫిర్యాదు చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. బాధితుల నుంచి సిసోడియా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. తమ భూములకు సంబంధించిన రికార్డులు తారుమారు చేసి భూ కబ్జా చేయడం జరిగిందని, తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో వచ్చామని బాధితులు ఏబీఎన్‌కు తెలిపారు. తమ భూమిని వైసీపీ నేతలు ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారని ఓ బాధితుడు తెలిపారు. ఇలా చాలా మంది బాధితులు తమ సమస్యలను ఏబీఎన్‌కు తెలిపారు. ఇకనైనా మా భూములు ఇప్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. గత ప్రభుత్వంలో కలెక్టర్, అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. వివరాల్లోకి వెళితే..


మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, ఇతర వైసీపీ నాయకుల భూఅక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు వందలాది మంది బాధితులు గురువారం మదనపల్లెకు తరలివచ్చారు. జోరుగా వర్షం కురుస్తున్నా.. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాను కలిసి తమ గోడు చెప్పుకొనేందుకు తడుస్తూనే క్యూలో నిలబడడం విశేషం. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో వారి నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. పెద్దిరెడ్డి, ఆయన అనుచరుల చేతుల్లో చిక్కుకున్న తమ భూములపై ఫిర్యాదు చేసేందుకు మదనపల్లె సబ్‌ డివిజన్‌ పరిధిలోని 11 మండలాల నుంచి భారీగా తరలివచ్చారు. పుంగనూరు, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల నుంచి వచ్చిన ఈ బాధితులతో సబ్‌కలెక్టర్‌ కార్యాలయం కిటకిటలాడింది. బాధితులు 300 మందికి పైగా ఉండడం చూసి సిసోడియా సైతం ఆశ్చర్యపోయినట్లు సమాచారం. తొలి రోజే ఇంతమంది వచ్చారని.. వచ్చే 2-3 రోజుల్లో ఇంకెంత మంది వస్తారోనని అధికార వర్గాలు అంటున్నాయి.


మా భూమి ఆక్రమించి మాపైనే కేసులు

కోటావూరు గ్రామం నాయనబండపల్లెలోని సర్వే నంబరు 386లో ఉన్న 1.25 ఎకరాల భూమిని 2002లో ఇతరుల నుంచి మేం కొన్నాం. మరో 24 సెంట్ల భూమిని 2022లో కొనుగోలు చేశాం. వైసీపీ ప్రభుత్వంలో 2023 ఫిబ్రవరిలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, ఆయన బావమరిది భానుప్రకాశ్‌రెడ్డి అండదండలతో కోటావూరుకు వైసీపీ నాయకులు చెన్నకేశవ, వెంకటేశ్వరప్రసాద్‌ తదితరులు మా భూమిని ఆక్రమించి.. మాపైనే తప్పుడు కేసులు పెట్టారు. ప్రస్తుతం మా పొలంలో పంట పెట్టుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఆ భూములకు సంబంధించి మా వద్ద అన్ని రికార్డులూ ఉన్నాయి. మా ఊరి వీఆర్‌వో నరేంద్ర మా పేరు మీద ఉన్న ఆన్‌లైన్‌ను తీసేశారంటూ బాధితులు వాపోయారు.


ఈ వార్తలు కూడా చదవండి..

యంగ్ స్టార్ కదా అని అవకాశమిస్తే..

పైశాచికానికి పరాకాష్ఠ

పోలవరం.. మూడేళ్లలో పూర్తి!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 26 , 2024 | 07:47 AM

Advertising
Advertising