వైసీపీ నేత హరికృష్ణారెడ్డి అరెస్ట్
ABN, Publish Date - Nov 08 , 2024 | 07:14 AM
వైసీపీ నేత కళ్లెం హరికృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేత పరిటాల శ్రీరాంపై ‘తొడగొట్టి నీ అంతు చూస్తానంటూ’ సవాల్ విసిరారు. ఆ సందర్భంగా పరిటాల శ్రీరాంపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశాడు.
వైసీపీ నేత కళ్లెం హరికృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేత పరిటాల శ్రీరాంపై ‘తొడగొట్టి నీ అంతు చూస్తానంటూ’ సవాల్ విసిరారు. ఆ సందర్భంగా పరిటాల శ్రీరాంపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశాడు. వైసీపీ సోషల్ మీడియా ఆగడాలపై ఫోకస్ పెట్టిన కూటమి సర్కార్ వరుస అరెస్టులతో దూకుడు పెంచింది.
కాగా వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డిని మంగళవారం రాత్రి పులివెందులలో చిన్నచౌకు పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తీసుకొచ్చారు. కడప తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఉంచగా.. 41ఏ నోటీసు ఇచ్చి పోలీసులు పంపించి వేసినట్లు సమాచారం. రవీంద్ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్న విషయం తెలుసుకున్న అన్నమయ్య జిల్లా రాజంపేట పోలీసులు కడపకు వచ్చారు. ఓ కేసులో రవీందర్ రెడ్డిని తీసుకెళ్ళేందుకు అక్కడికి రాగా... 41ఏ నోటీసు ఇచ్చి అతడిని పంపినట్లు తాలూకా పోలీసులు చెప్పారు. దీంతో వెంటనే రవీందర్ రెడ్డి కోసం రాజంపేట పోలీసులు బయటకు వచ్చి గాలించగా అప్పటికే అతడు పరారైనట్లు తెలుస్తోంది. రవీందర్ రెడ్డి స్నేహితుడు మహేశ్వరెడ్డిని కూడా రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహేశ్వరెడ్డి వేముల వద్ద తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అతడికి కొట్టి వాహనంలో ఎక్కించుకున్నారు. అయితే వర్రారవీందర్ రెడ్డిని తప్పించిన ఎపిసోడ్ మొత్తం ఎంపీ అవినా ష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ కావడంతో హుటా హుటిన కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కడపకు చేరుకున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో సమావేశమై రవీందర్ రెడ్డి గురించి డీఐజీ ఆరా తీస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 08 , 2024 | 07:14 AM