జగన్ అనుసరిస్తున్న విధానం ఇదీ..
ABN, Publish Date - Oct 31 , 2024 | 07:48 AM
ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పదవుల ఎర చూపి మరి కొందరితో విపక్ష నేతలను అడ్డగోలుగా తిట్టించారు. చివరకు రౌడీ షీటర్ బోరుగడ్డను కూడా సలహాదారుగా పెట్టుకుని లక్షల రూపాయల ప్రజా ధనాన్ని ఇచ్చారు.
అమరావతి: తన.. మన బేధం లేదు. తోబుట్టువులైనా.. ప్రతిపక్ష నేతలైనా వదిలేదే లేదు. తనకు ఎదురు తిరిగినా.. అన్యాయాలను ప్రశ్నించినా.. దండుపాళ్యం గ్యాంగ్‌ను దించడంలో జగన్ దిట్ట. నోరుంది.. నరంలేని నాలుక ఎటైనా మాట్లాడుతుంది. జగన్ ఉస్కో అంటే చాలు. కాస్కో అంటూ మీడియా ముందుకొచ్చి అచ్చొసిన ఆంబోతుల్లా పెట్రేగిపోతుంటారు. ఇదీ జగన్ సీఎం అయినా నాటి నుంచి అనుసరించిన విధానం.
ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పదవుల ఎర చూపి మరి కొందరితో విపక్ష నేతలను అడ్డగోలుగా తిట్టించారు. చివరకు రౌడీ షీటర్ బోరుగడ్డను కూడా సలహాదారుగా పెట్టుకుని లక్షల రూపాయల ప్రజా ధనాన్ని ఇచ్చారు. గన్‌నమెన్‌ల రక్షణ కల్పించి చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌తోపాటు మహిళలను కూడా అవమానపరిచే విధంగా తిట్టించిన ఘనుడు జగన్. ఇప్పుడు ఆస్తుల వివాదంలో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. అప్పట్లో బాబాయి వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడేందుకు చెల్లెళ్లు షర్మిల, సునీతపై కూడా బండ బూతులు తిట్టించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దీపావళికి సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్
దీపావళి రోజున ఈ తప్పులు అస్సలు చేయకండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 31 , 2024 | 07:48 AM