Budi Mutyala Naidu: సీఎం ఫ్యామిలీలో సీన్.. డిప్యూటీ సీఎం ఫ్యామిలీలో రీపిట్
ABN, Publish Date - Apr 25 , 2024 | 05:44 PM
సీఎం వైయస్ జగన్ ప్యామిలీలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో.. దాదాపుగా అదే తరహా సీన్.. ఆ పార్టీలోని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఫ్యామిలీలో కూడా చోటు చేసుకుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. వైయస్ జగన్ ఫ్యామిలీలో వైయస్ జగన్ వర్సెస్ వైయస్ షర్మిలతోపాటు వైయస్ సునీత అన్నట్లుగా పరిస్థితి ఉంది.

అదే డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ప్యామిలీలో అయితే. బూడి ముత్యాల నాయుడు పెద్ద భార్య కుమారుడు రవి వర్సెస్ బూడి ముత్యాల నాయుడు రెండో భార్య కుమార్తె అనురాద అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. 2019 ఎన్నికల్లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా మాడుగుల అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడు గెలుపొందారు.
వైయస్ జగన్ కేబినెట్ విస్తరణలో ఆయనను డిప్యూటీ సీఎం పదవి వరించింది. అంత వరకు ఓకే. కానీ 2024 ఎన్నికల వేళ.. బూడి ముత్యాల నాయుడును అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ బరిలో దింపారు. దీంతో జి మాడుగల అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా తన చిన్న భార్య కుమార్తె అనురాధకు ఛాన్స్ ఇప్పించేలా తాడేపల్లి ప్యాలెస్‌లో ముత్యాల నాయుడు బలంగా పావులు కదిపారు.
దీంతో ఆమె అభ్యర్థిత్వం ఖరారైంది. ఈ విషయం తెలిసిన పెద్ద భార్య కుమారుడు బూడి రవి... ఆగమేఘాల మీద రంగంలోకి దిగారు. అంతే మాడుగల నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా రవి నామినేషన్ వేసి బరిలో దిగారు. దీంతో ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్‌కి ఇంటి పోరు ఎలా ఉందో.. అదే విధంగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడికి ఇంటి పోరు.. పోరు బాట పట్టిందనే ఓ చర్చ ఫ్యాన్ పార్టీలో రింగ రింగా అంటూ వైరల్ అవుతుంది.
Read National News and Telugu News
Updated Date - Apr 25 , 2024 | 05:46 PM