ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Balineni Srinivasa Reddy: జనసేనలో బాలినేని చేరిక వెనుక అసలు రహస్యం ఇదేనా.. బయటపెట్టిన మాజీ మంత్రి

ABN, Publish Date - Mar 15 , 2025 | 12:18 PM

Balineni Srinivasa Reddy About Pawan Kalyan And Janasena Balineni Srinivasa Reddy: జనసేనలో బాలినేని చేరిక వెనుక అసలు రహస్యం ఇదేనా.. బయటపెట్టిన మాజీ మంత్రి

Balineni Srinivasa Reddy

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పవన్ కల్యాణ్, జనసేన పార్టీ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. తనకు పార్టీలో పదవులు అక్కర్లేదని, పవన్ సోపతి ఉంటే చాలు అంటున్నారు. శుక్రవారం జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో బాలినేని మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఒకానొక దశలో కంటతడి పెట్టుకున్నారు. వైఎస్ జగన్ అకృత్యాలను బయటపెట్టారు. పవన్ మంచి తనం గురించి కూడా చెప్పుకొచ్చారు. తన ప్రాణం ఉన్నంత వరకు జనసేన పార్టీలోనే ఉంటానని సపథం చేశారు. పవన్ కుటుంబాన్ని దారుణంగా తిట్టిన పోసాని కృష్ట మురళిపై కూడా ఫైర్ అయ్యారు. పోసానిని అరెస్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం ఆలస్యం చేసిందన్నారు. అదే తానైతే అధికారంలోకి వచ్చిన వెంటనే పోసానిని లాఠీతో కొట్టించి లోపల పడేయించేవాడినని అన్నారు.


దాని కోసమే జనసేన చేరిన బాలినేని..

పవన్ కల్యాణ్‌పై బాలినేని శ్రీనివాస రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. పవన్ కల్యాణ్ స్వశక్తితో ఎదిగిన నాయకుడి అన్నారు. ప్రతి పక్షంలో ఉన్నపుడు పవన్ తనను తిట్టలేదని అన్నారు. పైగా మంచి మంచివాడంటూ పొగిడారని చెప్పారు. ఆ రోజే జనసేనలో చేరకపోవటం తన దౌర్భాగ్యమని బాధపడ్డారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ పవన్‌ను కలిసినపుడు నేను కూటమిని విడగొడతానని కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. నా వల్ల ఆయనకు చెడ్డ పేరు రాకూడదు. పదవి ఆశించి జనసేనలో చేరలేదు. పవన్ ఇంకా ఎదగాలన్నదే నా ధ్యేయం. ఆయనతో సినిమా తీయాలని ఉంది. నా ప్రాణం ఉన్నంత వరకు జనసేనలోనే ఉంటా.. పవన్ కల్యాణ్‌తోనే ఉంటా. పవన్ కల్యాణ్ గురించి జగన్ మాట్లాడుతూ కౌన్సిలర్‌కు ఎక్కవ అన్నారు. అయ్యా జగన్ నువ్వు మీ నాన్న దయతో ముఖ్యమంత్రి అయ్యావు. మళ్లీ అవ్వు చూద్దాం’ అంటూ సవాల్ చేశారు. పవన్‌ తనతో సినిమా చేయాలన్న కండీషన్‌తోనే పార్టీలో చేరారన్న టాక్ బాగా నడుస్తోంది.


అమ్మవారి సాక్షిగా జగన్ గురించి పచ్చి నిజాలు..

పిఠాపురం అమ్మవారి సాక్షిగా అన్నీ నిజాలే చెబుతా.. అంటూ జగన్ తనను పెట్టిన ఇబ్బందులను బయటపెట్టారు. జగన్ తన ఆస్తులను కాజేశారంటూ కంటతడి పెట్టుకున్నారు. ఆ ఉక్రోషం, బాధ తనకు, తన కుటుంబానికి మాత్రమే తెలుసంటూ బాధపడ్డారు. తనకు జరిగిన అన్యాయం గురించి ఒక్క రోజులో చెబితే సరిపోదని అన్నారు. తన మీద, గత ప్రభుత్వ ఎమ్మెల్యేల మీద విచారణ వేయాలని, ఎవరు తప్పు చేశారో తెలుస్తుందని సవాల్ చేశారు. కోట్ల రూపాయలు ఎవరు సంపాదించారో తేలుతుందన్నారు. తనకు వైఎస్సార్ అంటే ఇష్టమని, రాజకీయ భిక్ష పెట్టింది కూడా ఆయనేనని అన్నారు. తన పదవి నాలుగేళ్లు ఉండగానే దాన్నివదిలేసి జగన్ వెంట నడిచాని చెప్పారు. వైసీపీ వచ్చాక తనకు మంత్రి పదవి ఇచ్చి వెంటనే తీసేశారని, అయినా కూడా తాను బాధపడలేదని అన్నారు. తనకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదని, అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటపెడతానని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Chandrababu Naidu: నిబద్ధతతో కూడిన రాజకీయాలకు ప్రతీక జనసేన

Pawan Kalyan: స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా.. ఆయన క్రేజే వేరు..

Balineni Srinivasa Reddy: అమ్మవారి సాక్షిగా వైసీపీ గురించి పచ్చి నిజాలు చెప్పిన మాజీ మంత్రి

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 15 , 2025 | 12:25 PM