ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టీడీపీ హయాంలోనే ప్రాధాన్యత

ABN, Publish Date - Jan 11 , 2025 | 12:22 AM

తెలు గుదేశం పార్టీ హయాంలోనే రాష్ట్రం లోని నాయీ బ్రాహ్మణు లకు రాజ కీయ, సామాజిక, ఆర్థిక ప్రాధాన్యత దక్కిందని ఆ సంఘం కార్పొరేషన్‌ చైర్మన్‌ రుద్రకోటి సదాశివం పేర్కొన్నారు.

పీలేరులో జరిగిన అభినందన సభలో మాట్లాడుతున్న సదాశివం

రాష్ట్ర నాయీబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ సదాశివం

పీలేరు, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): తెలు గుదేశం పార్టీ హయాంలోనే రాష్ట్రం లోని నాయీ బ్రాహ్మణు లకు రాజ కీయ, సామాజిక, ఆర్థిక ప్రాధాన్యత దక్కిందని ఆ సంఘం కార్పొరేషన్‌ చైర్మన్‌ రుద్రకోటి సదాశివం పేర్కొన్నారు. పీలేరు నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాయిబ్రాహ్మణుల పేద పరిస్థితులను చూసిన దివంగత సీఎం ఎన్టీఆర్‌ 1989లో ఫెడరేషన్‌ ఏర్పాటు చేశారని, తదనంతర కాలంలో సీఎం చంద్రబాబు దాన్ని కార్పొరేషన్‌గా మార్చారన్నారు. ఈ కార్పొరేషన్‌ ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది నాయీబ్రాహ్మణులు అటు వృత్తి, ఇటు వ్యక్తిగత జీవితాల్లో ఎంతో అభివృద్ధి చెందారన్నారు. టీటీడీ పాలకమండలి లోనూ ఇద్దరు నాయీబ్రాహ్మణులకు స్థానం కల్పించిన ఘనత చంద్ర బాబుకే దక్కిందన్నారు. గత ఐదేళ్ల కాలంలో జగన్‌ సర్కారును బీసీలను పూర్తిగా విస్మరించిందని, పేరుకు 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా నిధులు, విధులు లేకపోవడంతో అవి అలంకారప్రాయంగా మిగిలిపోయా రన్నారు. అనంతరం ఆయనను స్థానిక నాయకులు ఘనంగా సన్మానిం చారు. కార్యక్రమంలో తిరుపతి జిల్లా నాయీబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె.మల్లిఖార్జున, మాజీ ఎంపీపీ మహితా ఆనంద్‌, పీలేరు సంఘం అధ్యక్షుడు ఎర్రయ్య, సభ్యులు రాజగోపాల్‌, ఆంజనేయులు, రమేశ్‌, గిరి, వాణి, వెంకటరమణ, రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 12:22 AM