Share News

పరిసరాల పరిశుభ్రతే లక్ష్యం

ABN , Publish Date - Feb 15 , 2025 | 11:53 PM

గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రతే లక్ష్యంగా ప్రజలు పగతిపథంలో పయనించాలని డీఎల్‌ డీవో ఆమరనాథరెడ్డి పేర్కొన్నారు.

పరిసరాల పరిశుభ్రతే లక్ష్యం
మదనపల్లెలో స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు

స్వచ్ఛఆంధ్ర.. స్వర్ణ ఆంధ్ర దివస్‌ కార్యక్రమంలో వక్తల పిలుపు ర్యాలీలు, మానవహారాలు, ప్రతిజ్ఞలతో ప్రజలకు అవగాహన

మదనపల్లె టౌన, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రతే లక్ష్యంగా ప్రజలు పగతిపథంలో పయనించాలని డీఎల్‌ డీవో ఆమరనాథరెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని బొమ్మనచెరువు గ్రామంలో స్వచ్ఛఆంధ్ర.. స్వర్ణ ఆంధ్ర దివస్‌ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులతో మానవ హారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎల్‌ డీవో మాట్లాడుతూ చిన్నతనం నుంచి వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగమల్లి, ఉపాధి ఏపీవో సుభ్రమణ్యం, ఉపాధ్యాయులు, అంగనవాడి సిబ్బంది పాల్గొన్నారు. స్వఛ్చాంధ్ర లక్ష్యంగా విద్యార్థులు కృషి చేయాలని ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల డైరెక్టర్‌ రామలింగారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఒంటిమిట్టపల్లెలో ఆదిత్య కళాశాల ఎనఎస్‌ఎస్‌ విద్యార్థులు స్వచ్ఛాంద్ర కార్యక్ర మంలో తడిచెత్త, పొడిచెత్త సేకరించడంపై ప్రజలకు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిం చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సతీష్‌బాబు, అరుణ్‌కుమార్‌రెడ్డి, అమరేశ్వర్‌, మంజుబాలాజి, విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు స్వచ్ఛాం ద్ర కార్యక్రమం నిర్వహించారు.

పీలేరులో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’ కార్యక్ర మం శనివారం పీలేరులో అట్టహాసంగా జరిగిం ది. మండలంలో పనిచేస్తున్న అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, పలు పార్టీల ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ, ఏపీ ట్రాన్సకో సిబ్బంది, పారి శుధ్య కార్మికులు, విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధి కారులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశను దేశం లోనే అత్యంత పరిశుభ్రత కలిగిన రాష్ట్రంగా తీర్చి దిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడు నెలలో ప్రతి మూడవ శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’ కార్యక్రమాన్ని చేపట్టార న్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలను భాగ స్వామ్యుల్ని చేయడం, పరిశుభ్రమైన వాతావర ణం ద్వారా ప్రజారోగ్య పరిరక్షణ, కాలుష్య ప్రభా వాన్ని తగ్గించడం ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’ కార్యక్రమ ప్రధాన లక్ష్యాలను వివరించారు. స్థానిక పంచాయతీ కార్యాలయం నుంచి నాలు గు రోడ్ల కూడలి వరకు ర్యాలీ చేపట్టి మానవ హారం నిర్వహించారు. అనంతరం చెత్త నిర్వహ ణను పకడ్బందీగా నిర్వహించి పర్యావరణాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ బూనారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో ట్రాన్సకో ఈఈ చం ద్రశేఖరరెడ్డి, ఎంఈవోలు లోకేశ్వర రెడ్డి, పద్మావ తమ్మ, ఈవోపీఆర్‌డీ లతీఫ్‌ ఖాన, ఎస్‌ఐ-2 లోకేశ, టీడీపీ నేతలు పురం రామ్మూర్తి, రహం తుల్లా, నౌలాక్‌, బుజ్జు, బీజేపీ నాయకులు వెంక టరమణ, సుధారాణి, జనసేన నాయకులు కామిశెట్టి సుధాకర్‌, ఏపీ పంచాయతీ కార్మికుల యూనియన రాష్ట్ర అధ్యక్షుడు ధనాశి వెంకట రామయ్య, తదితరులు పాల్గొన్నారు.

ములకలచెరువులో: స్వర్ణాంధ్ర స్వచ్చతతోనే సాధ్యమని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి పేర్కొన్నా రు. ములకలచెరువులో శనివారం జరిగిన స్వర్ణ ఆంధ్ర - స్వచ్చ ఆంధ్ర కార్యక్రమ ర్యాలీ జరిగిం ది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరి సరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం బస్టాండు సర్కిల్‌ నుంచి ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హరినారాయణ, ఎంఈవో వెంకటరమణ, ఏపీఎం మధు, టీడీపీ జిల్లా కార్యదర్శి యర్రగుడి సురేష్‌, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ ఛైర్మన కేవీ రమణ, నాయకు లు భజంత్రి రామాంజులు, ఫాస్టర్‌ శ్రీనివాసులు, రసూల్‌, సుబ్బినాయుడు పాల్గొన్నారు.

పెద్దతిప్పసముద్రంలో: స్వచ్చ ఆంధ్ర- స్వఛ్చ దివస్‌ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని ఎంపీడీవో అబ్దుల్‌ కలాం ఆజాద్‌ పేర్కొ న్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తరువాత ప్రతి నెల 3వ శనివారాన్ని స్వఛ్చ దివస్‌గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా శనివారం స్థానిక పీటీఎంలోని బస్టాం డు కూడలిలో మండల స్థాయి అదికారులు, ప్రజాప్రతినిధులతో కలసి పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండు కూడలిలో మానవహారంగా ఏర్పడి ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. స్థానిక సర్పంచ తమక శంకర, ఎంఈవో నారాయణ, వెలుగు ఏపీఎం హరి, ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ బాలచంద్రాచారి, హౌసింగ్‌ ఏఈ శ్రీనివాసులు, పీటీఎం మాజీ సర్పంచ రియాసత అలీఖాన, పాల్గొన్నారు.

నిమ్మనపల్లిలో: మండలంలోని నిమ్మనపల్లి, తవళం పంచాయతిలలో స్వఛ్చఆంధ్ర..స్వఛ్చ దివస్‌ కార్యక్రమాన్ని శనివారం ఎంపీడీవో పర మేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గ్రా సచివాలయ సిబ్బం ది పరిశుభ్రతపై ర్యాలీ చేసి ప్రజలకు అవగాహ న కల్పించారు. ఎంపీడీవో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ మిఽథునచక్రవర్తి, ఏపీవో రమేష్‌. గుర్రప్ప పాల్గొన్నారు.

గుర్రంకొండలో: ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని జిల్లా దేవదాయశాఖ అధికారి విశ్వనాథ్‌ పేర్కొన్నారు. మండలంలోని చెర్లోపల్లె రెడ్డెమ్మకొండ ఆలయంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు ఆలయం వద్ద పరిశుభ్రత పాటించేలా సిబ్బంది పని చేయాలన్నారు. అనంతరం పుష్కరిణి వద్ద పారిశుధ్య పనులను చేయించి ప్రతిజ్ఞ చేయిం చారు. ఈవో మంజుల, సిబ్బంది పాల్గొన్నారు.

బి.కొత్తకోటలో: ప్రజలందరూ పరిశుభ్రతను పాటించడం ద్వారా సంపూర్న ఆరోగ్యాన్ని పొంద వచ్చని బి.కొత్తకోట కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కిరణ్‌ పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక సీహెచసీలో అవగాహన సదస్సు నిర్వ హించారు. తడిచెత్త, పొడిచెత్త ఎక్కడపడితే అక్కడ వేయకూడదని, ప్లాస్టిక్‌ వాడకాన్ని నిరో ధించాలని పిలుపునిచ్చారు. స్వఛ్చ ఆంధ్ర బ్యాన ర్‌ చేతపట్టి ఆసుపత్రి ఎదుట ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఆరీఫుల్లా, ఫార్మసిస్ట్‌ సునీ ల్‌కుమార్‌, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

రామసముద్రంలో: స్వర్ణ ఆంధ్రప్రదేశ.. స్వచ్ఛ దివస్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం మం డలంలోని అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యా లయాలలో పారిశుధ్య పనులు చేపట్టారు. మం డల కేంద్రంలో ఎంపీడీవో భానుప్రసాద్‌, మం డల టీడీపీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌గౌడు, ఆధ్వర్యంలో అధికారులు, పాఠశాల ఉపాధ్యా యులు, విద్యార్థులు, సచివాలయ సిబ్బంది, పా రిశుధ్య కార్మికులు, ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్‌ సర్కిల్‌లో మానవహారం నిర్వహించారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకుడు బందెల శివ, సమ తా సేవ సంగ్‌ దళ్‌ అధ్యక్షుడు జయరాజ్‌, ఏపీ మోడల్‌ స్కూల్‌ చైర్మన బాలాజి, నాగరాజు, పీడీ చంద్ర, నారాయణ స్వామి, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీలు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 11:53 PM