వైభవంగా నలవీరగంగాభవానీ జాతర
ABN , Publish Date - Feb 14 , 2025 | 11:51 PM
మదనపల్లె మండలం సీటీ ఎం గ్రామంలో వెలసిన నలవీరగంగాభవానీ అమ్మవారి జాతర తిరుణాల అత్యంత వైభవంగా జరిగింది.

భక్తులతో పోటెత్తిన ఆలయం ప్రత్యేక ఆకర్షణగా చాందినీ బండ్లు
మదనపల్లె అర్బన, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): మదనపల్లె మండలం సీటీ ఎం గ్రామంలో వెలసిన నలవీరగంగాభవానీ అమ్మవారి జాతర తిరుణాల అత్యంత వైభవంగా జరిగింది. జాతర పురస్కరించుకుని గ్రామాల నుంచి చాందినీ, అన్నం, టెంకాయ పట్ల బండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ ప్రాంగణం జనాలతో కిక్కిరిసిపోయింది. మదనపల్లె మండలం, కొం డామారిపల్లె గ్రామం, వెంకటప్ప కోటకు చెందిన రొంపిచెర్ల పోతప్ప అనే టీడీపీ కార్యకర్త సీఎంగా చంద్ర బాబునాయుడు అధికారం చేపట్టిన సంద ర్భంగా చాందినీ బండి కట్టి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నాడు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది చాందినీ బండ్లు ఎక్కువగా కట్టారు. జాతర సందర్భంగా పొరు గు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నుంచే కాకుండా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, సత్యసాయి జిల్లాల నుంచి అఽధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ గ్రామాల నుంచి మహిళలు దీలు, బోనాలను ఊరేగింపు తరలివచ్చి గంగ మ్మకు సమర్పించారు. భక్తుల దర్శనం కోసం ఆలయకమిటీ సభ్యులు ప్రత్యే క దర్శనం, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా అమ్మవారి ఆల యం ముందర పొట్టేళ్లు, మేకపోతులను బలిచ్చారు. మదనపల్లె ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక సర్వీసులు జాతరకు నడిపారు. సీటీఎంలోని హరి డిఫెన్స అకాడమీ ఆధ్వర్యంలో 30మందిపైగా వలంటీర్లు భక్తులకు సేవలం దించారు. మదనపల్లె డీఎస్పీ కొండయ్యనాయుడు ఆధ్వ ర్యంలో మదనపల్లె తాలుకా సీఐ కళా వెంకటరమణ పర్యవేక్షణలో తాలుకా ఎస్‌ఐలు చంద్ర మోహన, హరిహరప్రసాద్‌తోపాటు 100మంది పోలీసులు ఎక్కడా ఆవాంఛ నీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా బందోబస్తు నిర్వహించారు. ఆలయకమిటీ సభ్యులు సీటీఎం సర్పంచ సగినాల ఆనంద పార్థసారథి, పారపట్ల సురేంద్రరెడ్డి, వెలుగుచంద్ర, పోగాకు వీరప్రతాప్‌లు భక్తులకు కావాల్సిన సౌకర్యాలను సమకూర్చారు.
గంగమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే
మదనపల్లె టౌన, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): సీటీఎంలో వెలసిన నల వీరగంగమ్మ జాతర సందర్భంగా ఎమ్మెల్యే షాజహానబాషా అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రి తిరుణాళ్ల సందర్భంగా ఎమ్మెల్యే షాజ హానబాషా గంగమ్మ ఆలయానికి చేరుకుని పూజల్లో పాల్గొన్నారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు జునైద్‌అక్బారి, రెడ్డిరామ్‌ప్రసాద్, చల్లా నరసిం హులు, తదితరులు పాల్గొన్నారు.