నిమిషాల్లోనే నేరస్తుల చిట్టా
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:08 AM
ఇక నిమిషాల్లోనే నేరస్తుల చిట్టా విప్పేయవచ్చు. క్షణాల్లోనే నేరస్తుల వేలిముద్రలతో వారి బాగోతం బయటపెట్టవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేందుకు అత్యాధునిక పరికరాలను అందుబా టులోకి తెచ్చింది.

కర్నూలు క్రైం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ఇక నిమిషాల్లోనే నేరస్తుల చిట్టా విప్పేయవచ్చు. క్షణాల్లోనే నేరస్తుల వేలిముద్రలతో వారి బాగోతం బయటపెట్టవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేందుకు అత్యాధునిక పరికరాలను అందుబా టులోకి తెచ్చింది. శుక్రవారం సీఐడీలోని ఫింగర్ ప్రింట్స్, బ్యూరో విభాగం నుంచి కర్నూలుకు ఐదు ఫింగర్ ప్రింట్స్ లైవ్ స్కానర్స్, 8 మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజ్ పరికరాలు వచ్చాయి. ఈ పరికరాల పని తీరును ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ హాలులో పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందికి వాటి వినియోగంపై పలు సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు దొంగల ఆటకట్టించేందుకు, నేరాల కట్టడికి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామన్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ల పోలీసులు వినియోగించే విధంగా అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోనే నేరస్తులు, అనుమానితుల వేలిముద్రలను వేగంగా కచ్చితత్వంగా సేకరిస్తామన్నారు.
డిజిటల్‌గా వేలిముద్రలను భద్రత పరచాలి:
విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా రాత్రి, పగలు సమ యాల్లో, జాతరలు, ఉత్సవాలు, బందోబస్తు, అనుమానిత ప్రాంతాలు, గస్తీ విధులలో ఉన్న పోలీసులు అనుమా నితులను ఆరా తీసి వారి వేలిముద్రలను సేకరించాలని సూచించారు. ఇదివరకే దొంగతనాలకు పాల్పడిన వారి నేరాల వివరాలు, ఫొటోలు వేలిముద్రలు ఇప్పటికే సాఫ్ట్‌వే ర్‌లో పొందుపరిచామన్నారు. వీరు భవిష్యత్తులో ఎక్కడైనా ఎలాంటి నేరానికి పాల్పడినా వేలిముద్రల సాయంతో వెంట నే దొరికే అవకాశం ఉందన్నారు. సేకరించిన వేలిముద్రలను సెంట్రల్ సర్వర్‌కు అనుసంధానం చేయాలన్నారు. అనుమా నితులను ఆరా తీయడంలో విధుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని పోలీసు అధికారులకు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేరస్తులు కొత్త పద్ధతుల్లో చోరీలకు పాల్పడుతు న్నారన్నారు. ఈ నేపథ్యంలో ఈ పరికరాలు ఎంతో ఉపయో గపడుతాయన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ తేజోమూర్తి, ఫింగర్ ప్రింట్ సీఐ పవన్ కుమార్ రెడ్డి, పత్తికొండ సీఐ జయన్న, ఎమ్మిగనూరు సీఐ శ్రీనివాసులు, ఆలూరు సీఐ వెంకట చలపతి ఉన్నారు.