అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే గౌరు చరిత

ABN, Publish Date - Apr 05 , 2025 | 01:09 AM

భివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే గౌరు చరిత
భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే గౌరు చరిత

ఓర్వకల్లు, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. శుక్రవారం ఓర్వకల్లులో రూ.36.10 లక్షలతో 60వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ ట్యాంకు నిర్మా ణానికి ఆమె భూమి పూజ చేశారు. అనంతరం గ్రామ సచివాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేసిందన్నారు. చంద్రబాబు హయాంలోనే విమానాశ్రయం, ఉక్కుపరిశ్రమ, డీఆర్‌డీవో, సోలార్‌ పార్కు వంటి పరిశ్రమలు ఏర్పాటు చేశారన్నారు. ఓర్వకల్లులో తాగునీటి సమస్య లేకుండా నూతన వాటర్‌ ట్యాంకును నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తిప్పన్న, జడ్పీటీసీ రంగనాథగౌడు, తహీసల్దార్‌ విద్యాసాగర్‌, ఎంపీడీవో శ్రీనివాసులు, ఆర్‌డబ్లూఎస్‌ డీఈ అమల, ఏఈ శ్రీనివాసులు, ఎస్‌ఐ సునీల్‌ కుమార్‌, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, టీడీపీ మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మోహనరెడ్డి, నాయకులు రాంభూ పాల్‌రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, భాస్కర్‌రెడ్డి, అల్లాబాబు, ఏసేపు, రాజన్న, శ్రీనివాసులు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

ఆర్టీసీ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం: ఓర్వకల్లు ఆర్టీసీ బస్టాండులో అపరిశుభ్రంగా ఉండటంతోపాటు గత ఏడు రోజులుగా విద్యుత లేకపోవడంతో ఎమ్మెల్యే గౌరు చరిత ఆర్టీసీ అఽధికారులపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. బస్టాండులో చెత్తాచెదారం ఉండడమే కాకుండా రాత్రివేళలో విద్యుత లేదని ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన ఎమ్మెల్యే బస్టాండును తనిఖీ చేసి పరిశీలించారు.

పొగాకును కొనుగోలు చేయండి: ఓర్వకల్లులోని ఐటీసీ కంపెనీలో ప్రతి రైతు పొగాకును తప్పనిసరిగా కొనుగోలు చేయాలని కంపెనీ యజమా న్యాన్ని ఎమ్మెల్యే గౌరు చరిత కోరారు. రైతులు ఐటీసీ కంపెనీ వారు గిట్టు బాటు ధర కల్పించడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ల డంతో స్పందించిన ఆమె ఐటీసీ పొగాకును విక్రయిస్తున్న గోడౌన వద్ద కు వెళ్లి రైతుల సమస్యలు అడిగి తెలుసుకుని కంపెనీ యజమానితో మాట్లాడారు. తేమ శాతం ఉందని పొగాకును కొనుగోలు చేయకపోవ డం సరికాదన్నారు.

Updated Date - Apr 05 , 2025 | 01:09 AM