Share News

కర్నూలు డీసీసీ అధ్యక్షుడిపై వేటు..!

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:05 AM

జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు పి.మురళీకృష్ణను ఏపీసీసీ అధ్యక్షు రాలు వైఎస్‌ షర్మిల తొలగించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన్ను జిల్లా అధ్యక్ష స్థానం నుంచి తొలగిస్తూ నోట్‌ జారీ చేశారు.

కర్నూలు డీసీసీ అధ్యక్షుడిపై వేటు..!
కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం

సస్పెండ్‌ చేస్తూ ఏపీసీసీ ప్రకటన

నిర్ణయాన్ని శిరసావహిస్తా : మురళీకృష్ణ

కర్నూలు అర్బన్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు పి.మురళీకృష్ణను ఏపీసీసీ అధ్యక్షు రాలు వైఎస్‌ షర్మిల తొలగించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన్ను జిల్లా అధ్యక్ష స్థానం నుంచి తొలగిస్తూ నోట్‌ జారీ చేశారు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం భవనం పేరుతో సొసైటీ ఏర్పాటు చేయడంతో పాటు పలు ఆరోపణలతో పార్టీ సీనియర్‌ నాయకులు ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. ఏపీ పీసీసీ కార్యాలయం వెంటనే స్పందించి జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించింది. రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకుని సొసైటీని కూడా రద్దు చేయించింది. సీడబ్ల్యూసీ ప్రత్యేక సభ్యుడు గిడుగు రుద్రరాజును జరిగిన ఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ మేరకు జరిగిన సంఘటన వాస్తవ మేనని, డీసీసీ అఽధ్యక్షుడితో పాటు కమిటీలోని సభ్యులు కూడా ఇం దుకు బాధ్యులేనని, వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవస రం ఉందని పార్టీ హైక మాండ్‌కు నివే దిక ఇచ్చారు. స్పం దించిన పీసీసీ అఽధ్య క్షురాలు వైఎస్‌ షర్మి ల శుక్రవారం ముర ళీకృష్ణను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదే శించారు. ఆదేశాలు వెలువడిన వెంటనే కార్యాల యంలో నగర అధ్యక్షుడు జిలానీ బాషా నాయ కత్వంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు కె.బాబు రావు, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు బి.బ్రతుకన్న, లాజరస్‌, అనంతరత్నం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎవరైనా కాంగ్రెస్‌ పార్టీ ఆస్తుల జోలికి వస్తే ఇదే గతి పడుతుందని హెచ్చ రించారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఐక్యంగా పోరాటాలు చేసి పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

వారం రోజులుగా జరుగుతున్న సంఘటనలో భాగంగా అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తానని మాజీ డీసీసీ అధ్యక్షుడు పి.మురళీ కృష్ణ వెల్లడించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఇన్నాళ్లూ విజయవంతంగా కార్యక్రమాలు చేపట్టామన్నారు. నాయకులు, కార్యకర్తల సహకారంతో పార్టీ అభివృద్ధికి కృషి చేశానని ప్రకటనలో తెలిపారు.

Updated Date - Feb 15 , 2025 | 12:05 AM