నిధులు పక్కదారి పట్టించడంపై చర్యలు
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:01 AM
గత టీడీపీ ప్రభుత్వం హయాంలో జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా చేసిన పనులకు సంబంధించిన బిల్లులను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పక్కదారి పట్టించిన ఘటనపై అధికారులు చర్యలు ప్రారంభించారు. వైసీపీ సానుభూతిపరురాలైన సర్పంచ్, వైసీపీ నేతలు చెప్పినట్లే విన్న అప్పటి పంచాయతీ కార్యదర్శి నిబంధనలకు విరుద్ధంగా సొంతంగా డ్రా చేసి తమకు అనుకూలమైన వ్యక్తికి ముట్టజెప్పారు. ఆ ఉదంతానికి సంబంధించి సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయగా, అప్పటి పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు రంగం సిద్ధమైంది.

అద్దంకి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : గత టీడీపీ ప్రభుత్వం హయాంలో జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా చేసిన పనులకు సంబంధించిన బిల్లులను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పక్కదారి పట్టించిన ఘటనపై అధికారులు చర్యలు ప్రారంభించారు. వైసీపీ సానుభూతిపరురాలైన సర్పంచ్, వైసీపీ నేతలు చెప్పినట్లే విన్న అప్పటి పంచాయతీ కార్యదర్శి నిబంధనలకు విరుద్ధంగా సొంతంగా డ్రా చేసి తమకు అనుకూలమైన వ్యక్తికి ముట్టజెప్పారు. ఆ ఉదంతానికి సంబంధించి సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయగా, అప్పటి పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు రంగం సిద్ధమైంది. వివరాల్లోకెళ్తే... అద్దంకి మండలంలోని చినకొత్తపల్లిలో టీడీపీ నాయకుడు మానం మురళీమోహన్‌దా్‌స చినకొత్తపల్లి పంచాయతీ పరిధిలోని చినకొత్తపల్లి, శ్రీనివాసనగర్‌లలో 2018-19లో 50 లక్షల రూపాయల ఉపాధి నిధులతో సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్లు నిర్మించారు. ఈ పనులకు సంబంధించి టీడీపీ నేత మానం మురళీమోహన్‌దా్‌స 30 శాతం మెటిరియల్ కాంపొనెంట్ కింద 15,74,283 రూపాయల విలువైన సామగ్రి సరఫరా చేశారు. అందుకు సంబంధించి 2021 సెప్టెంబరు 3వ తేదీ 15,74,283 రూపాయలు ప్రభుత్వం నుంచి విడుదలయ్యాయి. ఈ నిధులను మురళీమోహన్‌దా్‌సకు చెల్లించాల్సి ఉండగా అప్పటిపంచాయతీ కార్యదర్శి(ప్రస్తుతంసంతమాగులూరు మండలం పాతమాగులూరు పంచాయతీ కార్యదర్శి) ఈశ్వరరెడ్డి, సర్పంచ్ గుజ్జుల మల్లికలు నేరుగా డ్రా చేసి సర్పంచ్ సోదరుడు చంద్రగిరి వీరారెడ్డికి చెల్లించారని మురళీమోహన్‌దా్‌స అప్పట్లోనే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరోసారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చీరాల డీఎల్‌పీవో శివనారాయణ గతేడాది డిసెంబరు 18వ తేదీ విచారణ చేపట్టి సర్పంచ్ గుజ్జుల మల్లికరెడ్డి, అప్పటి పంచాయతీ కార్యదర్శి ఈశ్వరరెడ్డిలు బ్యాంక్ నుంచి నేరుగా డబ్బులు డ్రా చేసినట్లు గుర్తించి జిల్లా అధికారులకు నివేదిక అందజేశారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిలకు సంజాయిషీ నోటీ్‌సలు జారీ చేశారు. నోటీ్‌సకు సర్పంచ్ మల్లిక ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని జిల్లా పంచాయతీ అధికారి 3 నెలల పాటు సర్పంచ్ చెక్ పవర్‌ను రద్దు చేస్తున్నట్లు రెండు రోజుల క్రితం ఉత్తర్వులు ఇచ్చారు. అప్పటి పంచాయతీ కార్యదర్శి ఈశ్వరరెడ్డిపై వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అదే సమయంలో పనులు చేయకుండా డబ్బులు తీసుకున్న సర్పంచ్ సోదరుడు చంద్రగిరి వీరారెడ్డిపై కూడా చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎట్టకేలకు టీడీపీ నేత మానం మురళీమోహన్‌దా్‌స పోరాటం ఫలించి అధికారం అడ్డుపెట్టుకొని డబ్బులు డ్రా చేసిన సర్పంచ్ గుజ్జుల మల్లిక చెక్ పవర్ రద్దు కాగా, మిగిలిన ఇద్దరిపై చర్యలకు రంగం సిద్ధమైంది.