scorecardresearch
Share News

మదీనా దర్గాలో వైభవంగా చందనోత్సవం

ABN , Publish Date - Mar 18 , 2025 | 12:02 AM

హిందూ.. ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలిచే కళింగపట్నంలోని మదీనా దర్గాలో సోమవారం చందనోత్సవాన్ని (ఉర్సు) వైభవంగా నిర్వహించారు.

మదీనా దర్గాలో వైభవంగా చందనోత్సవం
ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లింలు

గార, మార్చి 17(ఆంధ్రజ్యోతి): హిందూ.. ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలిచే కళింగపట్నంలోని మదీనా దర్గాలో సోమవారం చందనోత్సవాన్ని (ఉర్సు) వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే బాబా సమాధిపై చందన లేపనం పూసి... కొత్త వస్త్రాన్ని అలంకరించారు. ఆ తరువాత భక్తులకు దర్శనం కల్పించారు. మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం బాబా అంగరఖా (కొత్త వస్త్రం)ను దర్గా ఎదురుగా ఉన్న మసీదు వద్ద నుంచి దర్గా వద్దకు తీసుకు వచ్చి సమాధిపై కప్పారు. తర్వాత ఖురాన్‌ పఠనం, ఖవాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్గా ట్రస్టు సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Mar 18 , 2025 | 12:02 AM