Kumbh Mela... కుంభమేళా నుంచి తిరిగొస్తూ..
ABN , Publish Date - Feb 14 , 2025 | 11:31 PM
Returning from Kumbh Mela... ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న కుంభమేళాకు వెళ్లిన జిల్లా మహిళ తిరుగు ప్రయాణంలో మృతి చెందారు. దీంతో స్వగ్రామం ఎన్‌కే రాజపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

స్వగ్రామం ఎన్‌కే రాజపురంలో విషాదఛాయలు
పాలకొండ, ఫిబ్రవరి14 (ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న కుంభమేళాకు వెళ్లిన జిల్లా మహిళ తిరుగు ప్రయాణంలో మృతి చెందారు. దీంతో స్వగ్రామం ఎన్‌కే రాజపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఆర్తమూడి రాజేశ్వరి (58) తన భర్త భాగ్యారావుతో పాటు మరో 35 మందితో కలిసి వారం రోజుల కిందట ప్రత్యేక బస్సులో కుంభమేళాకు బయల్దేరి వెళ్లారు. ప్రయాగరాజ్‌లో పుణ్య స్నాన మాచరించిన అనంతరం వారు వారణాసి వెళ్లారు. శుక్రవారం కాశీవిశ్వేశ్వరుడిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే రాజేశ్వరి ఆయాసంతో తీవ్ర అస్వస్థతకు గురై అక్కడ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. భాగ్యారావు రిటైర్డ్ ఉద్యోగి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా వారణాసిలోనే రాజేశ్వరి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.