Tesla In India: భారత్‌లో టెస్లా ఎంట్రీ ఎప్పుడు? కార్ల ధర ఎంతంటే..

ABN, Publish Date - Feb 19 , 2025 | 05:25 PM

భారత్‌లో టెస్లా కార్ల విక్రయాలు ఏప్రిల్ నెల నుంచి ప్రారంభమవుతాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ముంబై, ఢిల్లీలో షోరూమ్‌లు ఏర్పాటు చేసేందుకు సంస్థ ఏర్పాట్లు ప్రారంభించిందని సమాచారం. రూ.22 లక్షల లోపు విద్యుత్ కార్లను భారత్‌లో విక్రయించేందుకు సంస్థ నిర్ణయించింది.

Tesla In India: భారత్‌లో టెస్లా ఎంట్రీ ఎప్పుడు? కార్ల ధర ఎంతంటే..

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో టెస్లా కార్ల అమ్మకాలు ఏప్రిల్ నెల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, బెర్లిన్‌లోని టెస్లా కార్లతయారీ ప్లాంట్ నుంచి దిగుమతి చేసుకున్న కార్లను భారత్‌లో విక్రయిస్తారని చెబుతున్నారు. ఈ దిశగా ముంబైలోని బీకేసీ బిజినెస్ డిస్ట్రిక్ట్, న్యూఢిల్లీలోని ఎయిరో సిటీలో షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నారు. 25 వేల డాలర్లు (రూ.22 లక్షలు) లోబడిన ఈవీ కార్ల మోడళ్లను భారత్‌లో విక్రయించేందుకు టెస్లా నిర్ణయించుకుంది (Tesla).


Tesla Hiring in India: కీలక పరిణామం.. భారత్‌లో ఉద్యోగుల నియామకాలు ప్రారంభించిన టెస్లా!

ఇక భారత్‌లో టెస్లా కార్ల తయారీపై ఇంకా స్పష్టత లేకపోయినప్పటికీ ఇక్కడి సంస్థల నుంచి టెస్లాకు కావాల్సిన విడి భాగాల సేకరించే యోచనలో సంస్థ ఉందని చెబుతున్నారు. వీటి విలువ ఈ ఏడాదిలోనే 1 బిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్ విదేశీ ఉత్పత్తులపై 70 శాతం సుంకం విధిస్తోంది. అయితే, భారత్‌తో సరితూగే స్థాయిలో తామూ సుంకాలు విధిస్తామని అమెరికా స్పష్టం చేయడంతో భవిష్యత్తులో భారత ఇంపోర్టు డ్యూటీ మరింత తగ్గే అవకాశం ఉందని కూడా టెస్లా భావిస్తోందట. భారత్ విధిస్తున్న అధిక సుంకాల కారణంగా టెస్లా దేశీయ మార్కెట్లోకి కాలుపెట్టలేకపోయింది. అయితే, ఇటీవల భారత్ 40 వేల డాలర్లకు పైబడిన విదేశీ కార్లపై 110 శాతం సుంకాన్ని 70 శాతానికి ఇటీవలే తగ్గించింది.


TCS Salary Hike: మార్చిలో టీసీఎస్‌లో శాలరీ పెంపు

ఇదిలా ఉంటే, అమెరికాలో వాణిజ్యంపై చర్చించేందుకు వాణిజ్య శాఖ వివిధ మంత్రిత్వ శాఖలో సమావేశం కానుంది. ఈ సందర్భంగా ఆటోమొబైల్ రంగంపై సుంకాల గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దిగుమతి చేసుకున్న కార్ల విక్రయాలతో పాటు భారత్‌లో కార్ల తయారీపై కూడా టెస్లా దృష్టి సారించిందట. ఇందు కోసం ప్లాంట్‌ల ఏర్పాటుకు మహారాష్ట్రలో పలు ప్రాంతాలను పరిశీలిస్తోందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఈ ఏడాది ద్వితీయార్థంలో భారత్‌లో పర్యటించనున్న డొనాల్డ్ ట్రంప్ వెంట ఎలాన్ మస్క్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట. ఇప్పటికే టెస్లా భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించే దిశగా ఉద్యోగ నియామకాలకు తెరతీసింది. ఢిల్లీ, ముంబై నగరాల్లో మొత్తం 13 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది.

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 19 , 2025 | 05:25 PM