Gold And Silver Rate: తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..
ABN , Publish Date - Apr 14 , 2025 | 09:51 AM
To Day Gold And Silver Rate: గత కొన్ని రోజుల నుంచి కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు ఊరట కలిగించాయి. నేడు 24,22,18 క్యారెట్ల బంగారం ధరలు తగ్గాయి. అంతేకాదు... సిల్వర్ ధరలు కూడా తగ్గటం విశేషం...

గతకొన్ని రోజుల నుంచి కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. నిన్న ( ఏప్రిల్ 13)న 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము 9,567 రూపాయలు ఉండింది. 22 క్యారెట్ల బంగారం ధర గ్రాము 8,770 రూపాయలు ఉండింది. ఇక, 18 క్యారెట్ల బంగారం ధర గ్రాము 7,176 రూపాయలు ఉండింది. నేడు మూడు రకాల బంగారంపై ధరలు తగ్గాయి. పదులు, వేలు కాదు.. కేవలం ఒక రూపాయి మాత్రమే.. ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 9,566 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారం ధర 8,769 రూపాయలు.. ఇక, 18 క్యారెట్ల బంగారం ధర 7,175 రూపాయలుగా ఉంది.
అదే పది గ్రాముల బంగారం ధర విషయానికి వస్తే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87,690 రూపాయలు ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 95,660 రూపాయలు.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 71,750 రూపాయలు ఉంది. సిల్వర్ ధరల విషయానికి వస్తే.. సిల్వర్ రేటు కూడా స్వల్పంగా తగ్గింది. నిన్న గ్రాము సిల్వర్ ధర 110 రూపాయలు ఉండింది. కేజీ సిల్వర్ ధర 1,10,000 రూపాయలు ఉండింది. ఈ రోజు గ్రాముపై 10 పైసలు తగ్గింది. గ్రాము సిల్వర్ ధర నేడు 109.90 రూపాయలుగా ఉంది. కేజీ సిల్వర్ ధర 109,900 రూపాయలుగా ఉంది.
ఇవి కూడా చదవండి
Nitin Gadkari: హైవేల బలోపేతానికి 10 లక్షల కోట్లు
Love Marriage: కుమార్తె ప్రేమ వివాహం.. కన్నీళ్లు తెప్పిస్తున్న తండ్రి సూసైడ్ లెటర్