Today Horoscope : ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ABN, Publish Date - Feb 06 , 2025 | 02:40 AM

రాశి ఫలాలు నేడు 6-2-2025 - గురువారం మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

Today Horoscope : ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

01 Mesham - Aries.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులు లాభిస్తాయి. రావలసిన నిధులు సకాలంలో చేతికి అందుతాయి. షేర్‌మార్కెట్‌ లావాదేవీల్లో నిదానం అవసరం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వేడుకలు ఆనందం కలిగిస్తాయి.


వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఉన్నత పదవులు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలమైన రోజు. పెద్దలు, కీలక పదవుల్లో ఉన్న వారి సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.


మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల విషయంలో సంకల్పం నెరవేరుతుంది. సినీ, రాజకీయ, న్యాయ, బోధన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చర్చలు, ప్రయాణాలు సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన సమాచారం అందుకుంటారు.


కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు, పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికపరమైన సమావేశాల్లో సత్ఫలితాలు సాధిస్తారు.


సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ప్రముఖులను కలుసుకుంటారు. సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. వివాహ నిర్ణయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. లక్ష్య సాధనలో భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది.


కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

వృత్తిపరమైన సమావేశాలు, చర్చలకు అనుకూలమైన రోజు, ప్రచురణలు, న్యాయ, ఉన్నత విద్యా రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. బంధుమిత్రులతో వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. దూరంలో ఉన్న సన్నిహితుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది.


తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

పన్నులు, బీమా, పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆడిటింగ్‌, ప్రకటనలు, హార్డ్‌వేర్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

గృహారంభ ప్రవేశాలు, వివాహాది శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు జరుగుతాయి. స్థిరాస్థి సమకూర్చుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి.


ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి కీలక సమాచారం అందుకుంటారు. సిబ్బంది నియామకానికి అనుకూల సమయం. వైద్యపరమైన సమాచారం సేకరిస్తారు. తోబుట్టువులు, సన్నిహితుల తో విందు వినోదాల్లో పాల్గొంటారు.


మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆడిటింగ్‌, అడ్వర్టయిజ్‌మెంట్‌, ఫైనాన్స్‌ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరమైన రోజు. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. చిన్నారుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంకల్పం నెరవేరుతుంది.


కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఇల్లు, స్థలసేకరణకు అవసరమైన నిధులు అందుతాయి. వేడుకలకు సన్నాహాలు చేస్తారు. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల వైఖరిలో మార్పు గమనిస్తారు.


మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

చర్చలు, ప్రయాణాలు, విద్యాపరమైన విషయాలకు ఇది అనుకూలమైన రోజు. తోబుట్టువుల విషయంలో మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయి. దూరంలో ఉన్న బంఽధువుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Feb 06 , 2025 | 02:40 AM