Today Horoscope: ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.

ABN, Publish Date - Mar 12 , 2025 | 12:20 AM

నేడు (12-03-2025- బుధవారం) విద్యార్థులకు అనుకూలమైన రోజు. దూరంలో ఉన్న ప్రియతములతో చర్చలు, సందేశాలు ఉల్లాసం కలిగిస్తాయి.

Today Horoscope:  ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.

నేడు (12-03-2025- బుధవారం) విద్యార్థులకు అనుకూలమైన రోజు. దూరంలో ఉన్న ప్రియతములతో చర్చలు, సందేశాలు ఉల్లాసం కలిగిస్తాయి.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

విద్యార్థులకు అనుకూలమైన రోజు. దూరంలో ఉన్న ప్రియతములతో చర్చలు, సందేశాలు ఉల్లాసం కలిగిస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. ఆడిటింగ్‌, కన్సల్టెన్సీ, సినిమా, ప్రకటనల రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేసి లక్ష్యాలు సాధిస్తారు.


వృషభం (ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

గృహనిర్మాణం, స్థలసేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థిక విషయాల్లో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వేడుకల్లో పాల్గొంటారు.


మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారరంగాల వారు ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో పెద్దల సహకారం లభిస్తుంది. పెద్దలతో చర్చలు ఫలిస్తాయి. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.


కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. పెట్టుబడులకు సంబంధించిన చర్చలకు అనుకూలమైన రోజు. ఆర్థిక విషయాల్లో బంధుమిత్రుల సహకారం అందుకుంటారు. పారితోషికాలు లభిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.


సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

పన్నుల వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. బీమా, మూచ్యువల్‌ ఫండ్స్‌కు నిధులు కేటాయిస్తారు. మెడికల్‌ క్లెయిములు మంజూరవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తారు. గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. పొదుపు పథకాలు లాభిస్తాయి.


కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

వేడుకలు, బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామికి సంబంధించిన రహస్య సమాచారం తెలుసుకుంటారు. న్యాయ పోరాటాల్లో విజయం సాధిస్తారు. పూర్వ పరిచయాలతో అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.


తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. బృందకార్యక్రమాలు, వేడుకలు ఆనందం కలిగిస్తాయి. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ఆర్థికంగా లాభిస్తుంది.


వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

తల్లిదండ్రుల విషయంలో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక విషయల్లో పెద్దల సహకారం లభిస్తుంది. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు.


ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

గృహారంభ, ప్రవేశాలకు అనుకూలం. దూరంలో ఉన్న బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.


మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

పన్నులు, పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. బీమా, మూచ్యువల్‌ ఫండ్‌ లావాదేవీలకు అనుకూలమైన రోజు. వడ్డీలు, విలువైన పత్రాలు అందుకుంటారు.


కుంభం (జనవరి 21 నుంచి ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. స్టాక్‌మార్కెట్‌ లావాదేవీల్లో లాభాలు గడిస్తారు. పందాలు, పోటీల్లో విజయం అందుకుంటారు. సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. సంకల్ప నెరవేరుతుంది.


మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు అమలు చేసి విజయం సాధిస్తారు. హోటల్‌, ఆస్పత్రుల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు వినోదాలు ఆహ్లాదం కలిగిస్తాయి. అనుకున్న పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు.

- శ్రీ బిజుమళ్ల బిందుమాధవ శర్మ సిద్ధాంతి

Updated Date - Mar 12 , 2025 | 12:21 AM