Best Time For Morning Walk: ఉదయం పూట వాకింగ్ చేస్తున్నారా.. ఎవరికి ఏ సమయం తగినదంటే..

ABN, Publish Date - Apr 04 , 2025 | 03:28 PM

ఉదయం పూట వాకింగ్ చేస్తారా? సూర్యోదయానికి ముందు వాకింగ్ చేయాలా లేక ఆ తరువాతా అన్న సందేహం ఎప్పుడైనా.. అయితే ఈ కథనం మీ కోసమే.

Best Time For Morning Walk: ఉదయం పూట వాకింగ్ చేస్తున్నారా.. ఎవరికి ఏ సమయం తగినదంటే..
Best time for Morning walk

ఇంటర్నెట్ డెస్క్: శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించుకునేందుకు వాకింగ్‌కు మించిన ఎక్సర్‌సైజు లేదంటే అతిశయోక్తి కాదు. అయితే, ఏ సమయంలో వాకింగ్ చేస్తున్నామనే దానిపై కూడా ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. వ్యక్తుల ఆరోగ్యం మొదలు రోజువారీ ఉండే పనులను బట్టి నడకకు అనువైన సమయాన్ని ఎంచుకోవాలి.

ఉదయం పూట వాకింగ్‌తో పలు ప్రయోజనాలు ఉన్నాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. మానసిక ఆరోగ్యం ఇనుమడింప చేస్తుంది. ప్రకృతి అందాలను ఆస్వాదించడంతో పాటు ఏకాగ్రత పెంచుకునేందుకు కూడా ఈ సమయం అనువైనది. సూర్మ రశ్మి ఒంటికి సోకడం ద్వారా విటమిన్ డీ తగినంతగా తయారవుతుంది.

అయితే, ఉదయం పూట కూడా కొన్ని సమయాలు కొందరికి అత్యంత అనుకూలమని అనుభవజ్ఞులు చెబుతున్నారు. ఇది వారి అభిరుచికి సంబంధించినదని కూడా. సూర్యోదయానికి ముందు అంటే 6.30 కు ముందే వాకింగ్ చాలా మందికి వాకింగ్ కోసం అనువైన సమయం. ఈ సమయంలో చల్లలి వాతావరణం శరీరానికి, మనస్సుకు విశ్రాంతినిస్తుంది.


ఇక ఉదయం 6.30 నుంచి 8.00 గంటల మధ్య సమయం కూడా కొంత వరకూ అనువైనది. ఈ టైమ్‌లో వాతావరణం ఓ మోస్తరు వేడితో ఉంటుంది. వెలుతురు కూడా తగినంతగా ఉంటుంది. ఈ సమయంలో వాకింగ్‌తో సూర్యరశ్మి ఒంటికి సోకి విటమిన్ డీ కూడా తగినంత లభిస్తుంది.

తీరికి లేకుండా బిజీగా గడిపే కొందరు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్యలో కూడా వాకింగ్ చేస్తుంటారు. బ్రేక్ ఫాస్ట్‌ చేశాక ఇలా చేస్తే అరుగుదల కూడా మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట వాకింగ్ చేయలేమనుకునే వారు వసంత కాలంలో ఉదయం వేళ వాకింగ్ అలవాటు చేసుకోవాలి.


హైబీపీ ఉన్న వారు చలికాలంలో ఉదయం వేళల్లో వాకింగ్ చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో సహజంగానే బీపీ పెరుగుతుంది కాబట్టి ఇంట్లో ఉండటమే మంచిది. ఇక డయాబెటిస్ పేషెంట్లకు మార్నింగ్ వాక్స్ అత్యంత అనువైనవి. దీంతో, షుగల్ లెవెల్స్‌ను సులువుగా నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు.

ఉదయం పూట వాకింగ్ చేసే వారు వాతావరణ పరిస్థితులపై కూడా దృష్టి పెట్టాలి. నగరాల్లో ఉదయం వేళ కాలుష్యం తక్కువగా ఉంటుంది కాబట్టి వాకింగ్‌కు ఇది అనువైన సమయం. ఇక చలికాలంలో సూర్యోదయం తరువాతే వాకింగ్ వెళ్లడం మంచిది. ఇక ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని వారు సూర్యోదయానికి ముందే వాకింగ్ పూర్తి చేయాలి.

ఇది కూడా చదవండి:

రోజూ 15 నిమిషాల పాటు జాగింత్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే..

టాయిలెట్ సీట్లపై కంటే దిండ్ల కవర్‌లపై ఎక్కువ బ్యాక్టీరియా.. తాజా అధ్యయనంలో వెల్లడి

ఇంట్లో ఏసీ లేదా.. ఇలా చేస్తే ఎండాకాలంలోనూ కూల్ కూల్

Read Latest and Health News

Updated Date - Apr 04 , 2025 | 03:29 PM