Share News

Dangers of Energy Drinks: పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ ఇస్తున్నారా? ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నారో తెలిస్తే..

ABN , Publish Date - Mar 13 , 2025 | 06:30 PM

ఎనర్జీ డ్రింక్స్ కారణంగా పిల్లలు, టీనేజర్లలో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అసలీ ప్రమాదాలు ఏమిటో సవివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

Dangers of Energy Drinks: పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ ఇస్తున్నారా? ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నారో తెలిస్తే..
Dangers of Energy Drinks

ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య కాలంలో పిల్లలు అతిగా ఎనర్జీ డ్రింక్స్ తాగేస్తున్నారు. ఉత్సాహం కోసం తాగుతున్నామని వారు అనుకుంటున్నప్పటికీ వీటిల్లోని అనేక అడిటివ్స్, ఇతర ప్రిజర్వేటివ్స్ ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఎమిటీ ఎనర్జీ డ్రింక్స్..

నిపుణులు చెప్పే దాని ప్రకారం, ఎనర్జీ డ్రింక్స్ తక్షణ ఉత్సాహాన్ని ఇస్తుంటాయి. అయితే, వీటిల్లో కెఫీన్‌తో పాటు చక్కెరలు, ఇతర ఉత్సాహకారక రసాయనాలు ఉంటాయి. ఇవన్నీ శరీరాన్ని మరింత ఉత్తేజితం చేస్తాయి. అయితే, నిత్యం ఇవి తాగే వారిలో దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని నిపుణులు మెచ్చరిస్తున్నారు (Dangers of Energy Drinks).


Ideal gym workout duration: జిమ్‌లో రోజూ ఎంత సేపు ఎక్సర్‌సైజులు చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయంటే..

పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ ఇవ్వడం అస్సలు సబబు కాదని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ చెబుతోంది. ఎదిగే దశలో ఉన్న కిడ్నీలు, గుండె, మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తోంది. ఎనర్జీ డ్రింక్స తాగే పిల్లల్లో డీహైడ్రేషన్, కిడ్నీల్లో రాళ్ల ముప్పు, కిడ్నీ పనితీరుపై ప్రతికూల ప్రభావం, తీవ్ర కిడ్నీ సమస్యల ముప్పును పెంచుతాయి. వీటితో దీర్ఘకాలిక సమస్యలు అనేకం ఉంటాయి.

ఎనర్జీ డ్రింక్స్‌లోని కెఫీన్ కారణంగా మూత్ర విసర్జన పెరిగి కిడ్నీలపై ఒత్తిడి అధికమవుతుంది.

వీటిల్లోని ఫాస్ఫోరిక్ యాసిడ్ కారణంగా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి.


Hair Dye - Side Effects: రెగ్యులర్‌‌గా హెయిర్ డై వేసుకునే వారు తెలియక చేసే తప్పు ఏంటంటే..

ఎనర్జీ డ్రింక్స్‌లోని అధిక చక్కెర కారణంగా ఊబకాయం, డయాబెటిస్ రావచ్చు. ఈ వ్యాధులు చివరకు కిడ్నీ పనితీరును దెబ్బతీస్తాయి.

వీటిల్లో ఉండే ఉత్ప్రేరకాల కారణంగా గుండె వేగం, రక్తపోటు పెరిగి కిడ్నీలు ప్రమాదంలో పడతాయి. ఇవన్నీ వెరసీ కిడ్నీ సమస్యల ముప్పును పెంచుతాయి.

కాబట్టి, పిల్లలు, టీనేజర్లు యాడ్స్ మాయలో పడకుండా మంచి నీళ్లు, కొబ్బరి నీరు, పళ్ల రసాలు, కొవ్వు తక్కువగా ఉన్న పాలతో చేసే హెర్బల్ టీలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Death due Extreme Dieting: బరువు తగ్గేందుకు కఠిన డైటింగ్.. టీనేజర్ దుర్మరణం

Read Latest and Health News

Updated Date - Mar 13 , 2025 | 06:31 PM