Night Time Driving: రాత్రి పూట డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ABN, Publish Date - Feb 09 , 2025 | 09:08 PM
రాత్రి పూట డ్రైవింగ్ చేసే వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: పగటి పూట డ్రైవింగ్‌తో పోలిస్తే రాత్రి డ్రైవింగ్ కొంత క్లిష్టమైనది. ఎదురుగా వచ్చే వాహనాల లైట్ల కాంతి, విండ్ స్క్రీన్‌పై పడి పరావర్తనం చెందే కాంతి కారణంగా రోడ్డును స్పష్టంగా చూడటం కష్టమవుతుంది. కాబట్టి, రాత్రి పూట వాహనాలు నడిపేవారు పలు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
రాత్రి పూట వెళ్లే వారు కారు విండ్ షీల్డ్, అద్దాలపై ఎటువంటి దుమ్ము లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. అద్దాలపై దుమ్ము, మరకల కారణంగా కంటిపై వెలుగు పడి ఎదురుగా ఉన్న రోడ్డు స్పష్టంగా కనిపించదు.
వాహనం హెడ్ లైట్స్ మరీ కాంతివంతంగా ఉంటే ఇతర వాహనదారులకు ఇబ్బందిగా మారుతుంది. కాంతి తక్కువగా ఉంటే డ్రైవర్‌కు రోడ్డు సరిగా కనిపించదు. కాబట్టి, హెడ్‌లైట్స్ ఎలా ఉన్నాయీ ముందుగా పరిశీలించి అవసరమైతే వాటిని మార్చుకున్నాకే రాత్రి పూట బయలుదేరాలి (Health).
Hormonal Balance: శరీరంలో హార్మోన్‌ల సమతౌల్యాన్ని కాపాడుకునేందుకు పాటించాల్సిన పద్ధతులు!
కారు డ్యాష్‌బోర్డుపై లైట్లు, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ వెలుతురు కారణంగా కళ్లు చెదిరే అవకాశం ఉంది. కాబట్టి, రాత్రి పూట డ్రైవ్ చేసేటప్పుడు కారు లోపలి లైట్లు వీలైనంత డిమ్‌గా ఉండేలా చూసుకోవాలి.
ఎక్కువ సేపు డ్రైవ్ చేయకుండా అప్పుడప్పుడూ కాస్త విరామం తీసుకోవాలి. దీంతో, కంటికి అలసట తగ్గుతుంది. వాహనానికి ఏదైనా అడ్డం వచ్చినప్పుడు వేగంగా స్పందించే అవకాశం ఉంటుంది.
రాత్రి పూట్ డ్రైవింగ్‌కు అనుకూలమైన కళ్లద్దాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ధరించి హైవేలపై వాహనడం తోలడం శ్రేయస్కరం. ఇవి ధరిస్తే ఎదురుగా వచ్చే వాహనాల తీక్షణ కాంతి నుంచి కంటికి ఇబ్బంది ఉండదు. మరింత స్పష్టంగా చూడగలుగుతారు.
Drinking from Cans: నేరుగా క్యాన్స్ నుంచి డ్రింక్ చేసే వారు తెలీక చేసే పొరపాటు ఇదే!
కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు కళ్లు ఆర్పడం మర్చిపోకూడదు. అదే పనిగా పరిసరాలను చూస్తూ ఉంటే కళ్లు పొడిబారి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది
ఎదురుగా వచ్చే వాహనాల హెడ్‌లైట్స్ వెలుగును నేరుగా చూస్తే కంటి చూపు తాత్కాలికంగా మసకబారుతుంది. ఈ ఇబ్బందిని తప్పించుకునేందుకు చూపును ఓవైపునకు తిప్పుకుంటే సులువుగా డ్రైవ్ చేయొచ్చు
ఇక రాత్రి పూట డ్రైవ్ చేసే వారు క్రమం తప్పకుండా కంటి చెకప్‌కు వెళితే చూపులో దోషాలను ముందుగా గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది.
Updated Date - Feb 09 , 2025 | 09:09 PM