Vitamins For Hair: జుట్టు ఆరోగ్యం కోసం ఈ విటమిన్స్ తప్పనిసరి!
ABN , Publish Date - Apr 06 , 2025 | 04:42 PM
జుట్టుకు మేలు చేసే విటమిన్స్ ఏవో? విటమిన్ సప్లిమెంట్స్‌తో జుట్టుకు ఎలాంటి మేలు కలుగుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: జుట్టు ఆరోగ్యం కోసం ఉద్దేశించిన విటమిన్‌లతో హెయిర్ సప్లిమెంట్స్ చేస్తారు. విటమిన్లతో పాటు వీటిల్లో ఇతర మినరల్స్ పోషకాలు కూడా ఉంటాయి. ఇవన్నీ జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. జుట్టు పలచబడం, ఊడటానికి కారణమైన విటమిన్ లోపాలను సరిదిద్దేందుకు ఈ సప్లిమెంట్స్‌ను డాక్టర్లు సూచిస్తారు. మరి జుట్టుకు మేలు చేసే విటమిన్‌లు ఏవో చూద్దాం.
జుట్టుకు మేలు చేసే వాటిల్లో విటమిన్ బీ7 చాలా ముఖ్యమైనది. ఇది కెరాటిన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. జుట్టులో కెరాటిన్ ఉంటుందన్న విషయం తెలిసిందే. విటమిన్ బీ7 లోపిస్తే వెంట్రుకలు సన్నగా మారతాయి. మెరుపును కోల్పోతాయి.
జుట్టు కుదుళ్లు మొదలు శరీరంలో అన్ని కణాల ఎదుగుదలకు విటమిన్ ఏ కీలకం. ఇక జుట్టుకు సంబంధించి ఈ విటమిన్ సీబమ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీంతో, జుట్టుకు తగినంత తేమ అందుతుంది. చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విటమిన్ ఎక్కువైతే జుట్టు రాలిపోతుంది కూడా.
యాంటీఆక్సిడెంట్ గుణాలున్న విటమిన్ సీతో జుట్టుకు ఫ్రీ రాడికల్స్ అనే రసాయనాల నుంచి రక్షణ లభిస్తుంది. జుట్టు ఎదుగుదలకు కీలకమైన ఐరన్ శరీరం గ్రహించేందుకు కూడా విటమిన్ సీ అవసరం. జుట్టు కుదుళ్లు పాడు కాకుండా ఈ విటమిన్ రక్షణ కల్పిస్తుంది.
విటమిన్ డీ లోపం కారణంగా ఆలోపేషియా వస్తుంది. అంటే నెత్తిపై కొన్ని చోట్ల జుట్టు పలుచబడుతుంది. ఇక విటమిన్ డీ సమృద్ధిగా ఉంటే నెత్తిపై కొత్తగా కుదుళ్లు కూడా ఏర్పడతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
విటమిన్ సీ లాగే విటమిన్ ఈ కూడా జుట్టుపై ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరిగేలా తోడ్పడుతుంది. విటమిన్ ఈ సప్లిమెంట్లు తీసుకునేవారిలో జుట్టు పెరుగుదల 34.5 శాతం ఇనుమడించినట్టు గతంలో పలు అధ్యయనాలు రుజువు చేశాయి
మహిళల్లో జుట్టు పలచబడటానికి ప్రధాన కారణాల్లో ఐరన్ లోపం కూడా ఒకటి. జుట్టు ఎదుగుదలకు కావాల్సిన ఆక్సిజన్‌ను రక్తం సమర్థవంతంగా సరఫరా చేసేందుకు ఐరన్ కీలకం. నెత్తిపై కణజాలం ఆరోగ్యంగా పెరిగేందుకు, పాడైన జుట్టు బాగుచేసే ప్రక్రియలకు జింక్ కీలకం. కాబట్టి, ఆహారంలో ఈ విటమిన్స సమృద్ధిగా లభించట్లేదని భావించేవారు వైద్యుల సలహా తీసుకున్నాక విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది.
ఇది కూడా చదవండి:
జుట్టుకు రోజూ నూనె రాసుకుంటారా.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు
రోజూ 15 నిమిషాల పాటు జాగింత్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే..
టాయిలెట్ సీట్లపై కంటే దిండ్ల కవర్‌లపై ఎక్కువ బ్యాక్టీరియా..