Tonga Island Earthquake: టోంగాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ABN, Publish Date - Mar 30 , 2025 | 07:25 PM
టోంగా ప్రధాన ఐలాండ్‌కు వాయవ్యంగా 100 కిలోమీటర్ల దూరంలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించిందని యూఎస్‌జీఎస్ తెలిపింది. దీంతో టోంగా తీరం వెంబడి గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ఉధృతంగా పెనుగాలుపు వీచే అవకాశాలున్నాయంటూ పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ హెచ్చరికలు జారీ చేసింది.
టోంగా: మయన్మార్ విలయం వేలాది మందిని పొట్టనపెట్టుకున్న ఉదంతం ఇంకా కళ్లముందు ఉండగానే పాలినేషియాలోని ద్వీప దేశం టోంగా (Tonga)లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైందని యూఎస్ జియాలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) ప్రకటించింది. దీంతో పసిఫిక్ ఐలాండ్ నేషన్‌లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ భూకంపంలో ఏమేరకు నష్టం జరిగిందనేది వెంటనే తెలియలేదు.
Myanmar Other Earthquake: మయన్మార్‌ను వదలని భూకంపాలు.. రెండు రోజుల్లో 2 సార్లు
టోంగా ప్రధాన ఐలాండ్‌కు వాయవ్యంగా 100 కిలోమీటర్ల దూరంలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించిందని యూఎస్‌జీఎస్ తెలిపింది. దీంతో టోంగా తీరం వెంబడి గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ఉధృతంగా పెనుగాలుపు వీచే అవకాశాలున్నాయంటూ పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ హెచ్చరికలు జారీ చేసింది.
పాలినేషియా దేశమైన టోంగాలో 171 ద్వీపాలు ఉండగా, లక్ష మందికి పైగా మాత్రమే జనాభా ఉంది. మెజారిటీ ప్రజలు ప్రధాన ఐలాండ్ టోంగటపులోనే నివసిస్తుంటారు. ఇది ఆస్ట్రేలియ కోస్ట్‌కు తూర్పున 3,5000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ దీవులన్నీ దాదాపు వైట్ శాండ్ బీచ్‌లుగానే ప్రసిద్ధి పొందాయి.
ఇవి కూడా చదవండి:
Earthquake In Myanmar: మయన్మార్‌లో భూకంపం.. థాయ్‌లాండ్‌లో ఎమర్జెన్సీ
Updated Date - Mar 30 , 2025 | 07:35 PM