Women in Space: అందరూ మహిళలతో అంతరిక్ష యాత్ర
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:04 AM
బ్లూ ఆరిజన్ సంస్థ నిర్వహించిన 11వ అంతరిక్ష యాత్రలో పూర్తిగా మహిళలతో కూడిన న్యూ షెపర్డ్ రాకెట్ రోదసీకి వెళ్లి తిరిగివచ్చింది. బెజోస్ ప్రియురాలు లౌరెన్ సాంచెజ్, పాప్ స్టార్ కేటీ పెర్రీ ఇందులో పాల్గొన్నారు

వారిలో బెజోస్ ప్రియురాలు లౌరెన్
వాషింగ్టన్, ఏప్రిల్ 14: అంతరిక్ష పర్యాటక యాత్రలను నిర్వహించే బ్లూ ఆరిజన్ సంస్థ సోమవారం అందరూ మహిళలతో కూడిన రాకెట్‌ను రోదసీలోకి పంపించింది. అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఆధ్వర్యంలోని ఈ కంపెనీ 11వ యాత్రలో భాగంగా ‘న్యూ షెపర్డ్ రాకెట్’లో ఆరుగురు మహిళలను పంపించింది. వీరిలో బెజోస్ ప్రియురాలు లౌరెన్ సాంచెజ్, పాప్ స్టార్ కేటీ పెర్రీ ఉన్నారు. రాకెట్ సిబ్బంది కూడా అందరూ మహిళలే కావడం విశేషం. పశ్చిమ టెక్సా్‌సలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.30 గంటలకు ఈ రాకెట్ బయలుదేరింది. నిటారుగా 100 కి.మీ. (60 మైళ్లు) ప్రయాణించి భూవాతావరణం, అంతరిక్షం సరిహద్దు అయిన ‘కర్మన్ రేఖ’ను దాటింది. అక్కడ గురుత్వాకర్షణ లేని శూన్య వాతావరణంలో వారంతా తేలియాడారు. తర్వాత, రాకెట్ తిరిగి భూమికి చేరుకుంది. ఈ యాత్ర మొత్తం పది నిమిషాల్లో ముగిసింది.
ఇవి కూడా చదవండి..