ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

China: ఎడారిలో భారీ సోలార్‌ వాల్‌

ABN, Publish Date - Jan 02 , 2025 | 05:16 AM

ఇసుక నుంచి కూడా తైలం పిండగల నేర్పు తనకుందని చైనా మరోసారి నిరూపిస్తోంది. ఇప్పటికే 21,196 కిలో మీటర్ల గ్రేట్‌ వాల్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న చైనా..

చైనా మరో అద్భుతం.. 400 కి.మీ.

పొడవు, 5 కి.మీ. వెడల్పుతో ప్లాంట్‌

100 గిగావాట్ల విద్యుత్తు లక్ష్యం

ఇప్పటికే 5.42 గిగావాట్ల ఉత్పత్తి

బీజింగ్‌, జనవరి 1: ఇసుక నుంచి కూడా తైలం పిండగల నేర్పు తనకుందని చైనా మరోసారి నిరూపిస్తోంది. ఇప్పటికే 21,196 కిలో మీటర్ల గ్రేట్‌ వాల్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న చైనా.. తమ దేశంలోని వాయవ్య ప్రాంతంలో ఉన్న కుబుఖీ ఎడారిలో ఇంకో గ్రేట్‌ వాల్‌ను నిర్మిస్తూ ఇప్పుడు మరో అద్భుతాన్ని సృష్టిస్తోంది. ఈ కొత్త గోడ సాధారణ ఇటుకలతో నిర్మించేది కాదు. కోట్ల కొద్దీ సౌర పలకలతో నిర్మించే సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌. 2030 కల్లా పూర్తవుతుందని భావిస్తున్న ఈ ప్లాంట్‌ పొడవు 400 కిలోమీటర్లు, వెడల్పు 5 కిలోమీటర్లు. దలాద్‌ బానెర్‌ ప్రాంతంలోని ఎడారిలో నిర్మించే ఈ సౌర విద్యుత్‌ గోడతో మొత్తం 100 గిగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలనేది చైనా లక్ష్యం. ఇప్పటి వరకు 5.42 గిగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే సౌర పలకలను అక్కడ అమర్చినట్లు డ్రాగన్‌ దేశం అధికారిక పత్రిక చైనా డైలీ వెల్లడించింది. ఇది పూర్తయితే ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్‌ ప్లాంట్‌ అవుతుంది.

Updated Date - Jan 02 , 2025 | 05:16 AM