ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: ట్రంప్‌కు 10న శిక్ష ప్రకటన

ABN, Publish Date - Jan 05 , 2025 | 02:43 AM

అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు హష్‌ మనీ కేసులో ఈనెల 10న శిక్ష వెల్లడిస్తానని న్యూయార్క్‌ కోర్టు జడ్జి జువాన్‌ ఎం.మెర్కన్‌ ప్రకటించారు.

హష్‌ మనీ కేసు.. కారాగారం ఉండబోదన్న జడ్జి

కోర్టు శిక్ష విధించిన తొలి అధ్యక్షుడిగా చరిత్ర పుటల్లోకి?

న్యూయార్క్‌, జనవరి 4: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు హష్‌ మనీ కేసులో ఈనెల 10న శిక్ష వెల్లడిస్తానని న్యూయార్క్‌ కోర్టు జడ్జి జువాన్‌ ఎం.మెర్కన్‌ ప్రకటించారు. శృంగార తార స్టార్మీ డానియల్‌తో ట్రంప్‌ గతంలో జరిపిన రాసలీలలను బయటపెట్టకుండా ఉండేందుకు 2016లో అధ్యక్ష ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఆమెకు 1.30 లక్షల డాలర్ల ముడుపులు(హష్‌ మనీ) ముట్టజెప్పారనేది అభియోగం. ఎన్నికల ప్రచారానికి అందిన విరాళాల సొమ్ము నుంచి ఆ ముడుపులు చెల్లించారన్నది ఆరోపణ. శుక్రవారం ఈ కేసు విచారణ సందర్భంగా జడ్జి తీర్పుపై తాజా నిర్ణయాన్ని వెల్లడించారు. అయితే, ట్రంప్‌కు కారాగార శిక్ష ఉండబోదని తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి సరిగ్గా పది రోజుల ముందు ఈ తీర్పు వెలువడనుంది. దీంతో కోర్టులో శిక్ష పడిన తొలి అధ్యక్షుడిగా ట్రంప్‌ చరిత్రలో నిలిచిపోనున్నారు. అమెరికా అధ్యక్షుడు కాబోతున్నందున తనపై కేసును కొట్టివేయాలని ట్రంప్‌ చేసిన అభ్యర్థనను జడ్జి తిరస్కరించారు. శిక్షకు చట్టపరమైన అడ్డంకులు ఏమీ లేవని, ఈనెల 20న అమరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు ట్రంప్‌కు శిక్ష విధించడం తన బాధ్యత అని జడ్జి స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి 34 అంశాలలో రికార్డులు తారుమారు చేసినట్టు కూడా ట్రంప్‌పై అభియోగాలు నమోదయ్యాయి. గతేడాది మేలో ట్రంప్‌ను కోర్టు ఈ కేసులో దోషిగా తేల్చింది. గతేడాది నవంబరు 5న ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కేసు విచారణను జడ్జి మెర్కన్‌ నిలిపివేసి, తీర్పును నిరవధికంగా వాయిదా వేశారు.

Updated Date - Jan 05 , 2025 | 02:43 AM