Share News

Hajj 2025: హజ్‌ యాత్రకు పిల్లల్ని అనుమతించరు

ABN , Publish Date - Feb 12 , 2025 | 05:17 AM

హజ్‌ యాత్రకు వచ్చే భారీ జనసందోహం వల్ల పిల్లలకు ఏ విధమైన ముప్పూ ఏర్పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు హజ్‌-ఉమ్రా మంత్రిత్వశాఖ తెలిపింది. అలాగే, మొదటి సారిగా వచ్చే యాత్రికులకు హజ్‌ యాత్ర-2025లో ప్రాధాన్యం కల్పిస్తామని పేర్కొంది.

Hajj 2025: హజ్‌ యాత్రకు పిల్లల్ని అనుమతించరు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: సౌదీ అరేబియా ప్రభుత్వం హజ్‌ యాత్ర-2025 నిబంధనల్లో గణనీయమైన మార్పులు చేసింది. పిల్లలు ఈ యాత్రలో పాల్గొనకుండా నిషేధం విధించింది. హజ్‌ యాత్రకు వచ్చే భారీ జనసందోహం వల్ల పిల్లలకు ఏ విధమైన ముప్పూ ఏర్పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు హజ్‌-ఉమ్రా మంత్రిత్వశాఖ తెలిపింది. అలాగే, మొదటి సారిగా వచ్చే యాత్రికులకు హజ్‌ యాత్ర-2025లో ప్రాధాన్యం కల్పిస్తామని పేర్కొంది. మరింతమందికి ఈ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అలాగే, అనుమతి లేకుండా హజ్‌యాత్రలో పాల్గొనడాన్ని నివారించేందుకు ఈ నెల 1వ తేదీ నుంచి భారత్‌ సహా 14 దేశాల యాత్రికులకు సింగిల్‌ ఎంట్రీ వీసాలు మాత్రమే జారీ చేస్తున్నట్టు వివరించింది.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రభుత్వానికి రుణ మంజూరు పత్రాలు అందజేసిన హడ్కో ప్రతినిధులు

Also Read: కేటీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే..

Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం

Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి

Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు

Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు

For National News And Telugu News

Updated Date - Feb 12 , 2025 | 05:20 AM