Share News

Yoon Suk yeol Impeachment: దక్షిణ కొరియా అధ్యక్షుడిపై వేటు

ABN , Publish Date - Apr 05 , 2025 | 04:54 AM

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ను రాజ్యాంగ ధర్మాసనం పదవి నుండి తొలగించింది. కోర్టు తీర్పుతో ఎన్నికలు నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది

Yoon Suk yeol Impeachment: దక్షిణ కొరియా అధ్యక్షుడిపై వేటు

యూన్‌ను పదవి నుంచి తొలగించిన కోర్టు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 4: దక్షిణ కొరియాలో నాలుగు నెలలుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. ఆ దేశాధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ను రాజ్యాంగ ధర్మాసనం పదవి నుంచి తొలగించింది. గతేడాది డిసెంబరులో నేషనల్‌ అసెంబ్లీ ఆమోదించిన అభిశంసన తీర్మానాన్ని సమర్థిస్తూ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ తొలగింపు తక్షణమే అమల్లోకి వస్తుంది. ఈ క్రమంలో యూన్‌ ఉన్నపళంగా అధ్యక్ష నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. తాజా పరిణామాల నేపథ్యంలో దక్షిణ కొరియా చట్ట ప్రకారం 60 రోజుల్లోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. యూన్‌ సుక్‌ గతేడాది డిసెంబరులో సైనిక చట్టాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఆయన అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.


ఇవి కూడా చదవండి:

Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 05 , 2025 | 04:54 AM