ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

China US Trade War: ట్రంప్‌కు చైనా షాక్‌

ABN, First Publish Date - 2025-04-16T06:58:03+05:30

చైనాను అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మరింత తీవ్రం అయ్యింది, చైనా తాజాగా బోయింగ్‌ జెట్‌ విమానాల దిగుమతిని నిలిపివేసింది. "చైనా ఎయిర్‌లైన్స్"‌కు వాటి డెలివరీ ఆపాలని ఆదేశించిన చైనా, బోయింగ్‌ విడిభాగాల కొనుగోలు కూడా ఆపినట్టు ప్రకటించింది.

  • అమెరికా నుంచి బోయింగ్‌ జెట్లు బంద్‌

  • వాటిని తీసుకోవద్దని తమ ఎయిర్‌లైన్స్‌కు ఆదేశం

  • విమానాల విడిభాగాల దిగుమతీ నిలిపివేత

బీజింగ్‌, ఏప్రిల్‌ 15: అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటివరకు అమెరికా వస్తువులపై సుంకాలు భారీగా పెంచిన చైనా.. తాజాగా ఆ దేశం నుంచి బోయింగ్‌ జెట్‌ విమానాల దిగుమతినే నిలిపివేసింది. వాటి డెలివరీ తీసుకోవద్దని తన విమానయాన సంస్థ ‘చైనా ఎయిర్‌లైన్స్‌’ను ఆదేశించినట్లు ‘బ్లూమ్‌బెర్గ్‌ న్యూస్‌’ మంగళవారం వెల్లడించింది. అలాగే అమెరికన్‌ కంపెనీల నుంచి విమానాల విడిభాగాలు, పరికరాల కొనుగోలును కూడా ఆపేయాలని నిర్దేశించింది. అమెరికా నుంచి దిగుమతులపై చైనా టారి్‌ఫలు పెంచడంతో అక్కడి నుంచి విమానాలు, విడిభాగాలు తీసుకురావడానికి వ్యయం తడిసిమోపెడవుతోంది. దీంతో బోయింగ్‌ విమానాలను లీజుకు తీసుకునే చైనా విమానయాన సంస్థలకు ఆర్థికంగా ఊతమివ్వాలని చైనా యోచిస్తోంది. గత జనవరిలో ట్రంప్‌ రెండో సారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మిత్రులు, ప్రత్యర్థులు అనే తేడా లేకుండా.. ప్రతి దేశం తమకు చేసే ఎగుమతులపై ఎడాపెడా సుంకాలు విధిస్తున్నారు. చైనా దిగుమతులపై ఏకంగా 145 శాతం వరకు సుంకాలు ప్రకటించారు. దీనికి ప్రతీకారంగా అమెరికా నుంచి దిగుమతులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు చైనా వెల్లడించింది. అంతటితో ఆగకుండా ఇప్పుడు ఏకంగా బోయింగ్‌ విమానాలనే ఆపేసింది. బోయింగ్‌ అమెరికాకు చెందిన అతిపెద్ద విమానతయారీ సంస్థ అయిన సంగతి తెలిసిందే. బోయింగ్‌ విమానాల్లో 30 శాతం వరకూ చైనాయే కొంటోంది. చైనా నిర్ణయంతో మంగళవారం బోయింగ్‌ కంపెనీ షేర్లు పతనమయ్యాయి.

Updated Date - 2025-04-16T08:25:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising