Salman Khan: రామ్ జన్మభూమి వాచ్ ధరించిన సల్మాన్

ABN, Publish Date - Mar 28 , 2025 | 11:56 AM

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కొత్తగా ధరించిన వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

Salman Khan: రామ్ జన్మభూమి వాచ్ ధరించిన సల్మాన్

Sikandar Movie: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) కొత్తగా ధరించిన వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. తన న్యూ మూవీ 'సికిందర్' ఈద్ (రంజాన్) సందర్భంగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆ సినిమాని ప్రమోట్ చేస్తూ సల్మాన్ పెట్టిన పోస్ట్ లో ఆయన చేతికి ధరించిన వాచ్ అందర్నీ ఆకట్టుకుంటోంది.


తాజాగా సల్మాన్ ఖాన్ జాకబ్ & కో కంపెనీ తయారు చేసిన 'ఎపిక్ ఎక్స్ రామ్ జన్మభూమి టైటానియం ఎడిషన్ 2' అనే లిమిటెడ్ ఎడిషన్ వాచ్‌ను తన చేతికి పెట్టుకున్నాడు. ఈ వాచ్ ఖరీదు రూ.34 లక్షలు. ఈ వాచ్ ఎథోస్ వాచెస్‌తో కలిసి పనిచేస్తుందట. ఇక ఈ వాచ్ రామ జన్మభూమి స్థలం, సాంస్కృతిక ఇంకా ఆధ్యాత్మిక సారాన్ని ప్రతిబింబించే విధంగా తయారు చేశారు.


ఇంకా, డయల్ పై హిందూ దేవుళ్ల కి సంబంధించి శాసనాలు ఉన్నాయి. 44 mm కేస్ కలిగి ఉంది. నీలమణి క్రిస్టల్ గ్లాస్‌తో తయారు చేశారు. నారింజ రబ్బరు బెల్ట్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఇంకా భారత్ కు చెందిన నాలుగు ఐకానిక్ స్మారక చిహ్నాలను కలిగి ఉంది వీటిలో తాజ్ మహల్, ఇండియా గేట్, గేట్వే ఆఫ్ ఇండియా ఇంకా కుతుబ్ మినార్ లను సంక్లిష్టమైన 2D టైటానియం డిజైన్లలో రూపొందించారు.


ఇక, 'సికిందర్' మూవీ ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కింది. రష్మిక హీరోయిన్. సల్మాన్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇటీవల సికిందర్ (Sikandar Movie) సినిమా పై కాస్తంత నెగిటివిటీ నడుస్తోన్న తరుణంలో న్యూట్రలైజ్ చేసేందుకో ఇంకేమో గానీ సల్మాన్.. రామ్ జన్మభూమి వాచ్ (Ram Janmabhoomi Watch) తో ముందుకొచ్చాడు.


ఇవి కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

అమెరికాలో మకార్తీ భూతం మళ్లీనా?

పుష్కరాల్లోపే పోలవరం

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latet Telugu News Click Here

Updated Date - Mar 28 , 2025 | 12:08 PM