Share News

Ranya Rao questioned by Police: నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసు.. విచారణలో బయటపడ్డ కీలక విషయాలు

ABN , Publish Date - Mar 07 , 2025 | 01:16 PM

తాను బంగారాన్ని తీసుకొచ్చినట్టు నటి రన్యా రావు పోలీసుల విచారణలో పేర్కొన్నారు. అంతేకాకుండా, పలుమార్లు అంతర్జాతీయ పర్యటనలు జరిపినట్టు కూడా వెల్లడించారు. అయితే, ఆమెను మరింతగా విచారించేందుకు పోలీసులు న్యాయస్థానం అనుమతి కోరారు.

Ranya Rao questioned by Police: నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసు.. విచారణలో బయటపడ్డ కీలక విషయాలు

ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్‌ నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు ఎయిర్‌పోర్టులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన కన్నడ నటి రన్యా రావు పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించింది. తాను 17 బంగారం బార్స్‌ను తీసుకొచ్చినట్టు వెల్లడించింది.‘‘నేను ఐరోపా, అమెరికా, మధ్యప్రాచ్యం, దుబాయ్, దక్షిణాఫ్రికా దేశాల్లో పర్యటించా’’ అని ఆమె తన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. తాను కేఎస్ హెగ్డేష్ అనే రియల్ఎస్టేట్ వ్యాపారి కుమార్తెనని, తన భర్త జతిన్ హుక్కేరి ఒక ఆర్కిటెక్ట్ అని వెల్లడించింది. తన విచారణ న్యాయబద్ధంగా సాగుతోందని, ఎలాంటి ఒత్తిడి లేకుండా తను వాగ్మూలం ఇస్తున్నట్టు కూడా స్పష్టంగా వెల్లడించింది. తనకు కస్టడీలో ఉండగా ఆహారం ఇచ్చినా ఆకలి లేకపోవడంతో దాన్ని తిరస్కరించినట్టు పేర్కొంది. బంగారం స్మగ్లింగ్‌కు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంజెలిజెన్స్ అధికారులకు సమాచారం అందడంతో వారు బెంగళూరు ఎయిర్‌పోర్టులో రన్యా రావును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆర్థిక నేరాల విచారణ కోర్టు ఆమెకు మార్చి 18 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధించింది. నేడు ఆమె బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది.


14 Year Old Forcibly Married: కర్ణాటకలో దారుణం.. 14 ఏళ్ల బాలికకు బలవంతంగా పెళ్లి చేసి ఆపై..

కాగా, అంతకుమునుపు కోర్టు విచారణ సందర్భంగా డీఆర్ఐ అధికారులు నటి కస్టడీని తమకు అప్పగించాలని కోరారు. మార్చి 9 తరువాత మూడు రోజుల పాటు ఆమెను విచారించేందుకు అనుమతించాలని అన్నారు. ఆమె వెనక భారీ స్మగ్లింగ్ నెట్వర్క్ ఉందేమో వెలికి తీయాల్సిన అవసరం ఉందని కోర్టుకు నివేదించారు. ఈ మధ్యకాలంలో ఇంత భారీ స్థాయిలో బంగారం స్మగ్లింగ్‌ బయటపడలేదని డీఆర్‌ఐ అధికారులు పేర్కొన్నారు. తన ఒంటికి బంగారు బిస్కెట్లను అంటించుకుని, ఎవరికీ కనబడకుండా దుస్తుల్లో దాచి రన్యా రావు స్మగ్లింగ్‌కు ప్రయత్నించింది. గతేడాదిలో ఆమె ఏకంగా 30 సార్లు దుబాయ్‌కు స్వల్ప కాలిక పర్యటనలపై వెళ్లి వచ్చింది. తన సవితి తండ్రి, సీనియర్ పోలీసు అధికారి కే రామచంద్రరావు వీఐసీ హోదాను అడ్డుపెట్టుకుని ఎయిర్‌పోర్టులో తనిఖీలను తప్పించుకుని స్మగ్లింగ్ చేసినట్టు అనుమానాలు ఉన్నాయి.


UP Father kills Daughter: పొరుగింటి వారితో వివాదం.. 5 ఏళ్ల కూతురిని పొట్టన పెట్టుకున్న తండ్రి

తనకు ఆమె కార్యకలాపాలతో ఎటువంటి సంబంధం లేదని కే రామచంద్రరావు స్పష్టం చేశారు. వివాహం తరువాత ఆమె తమకు దూరంగా ఉంటోందని అన్నారు. ఇక నటికి సంబంధించిన నివాసాల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు మొత్తం రూ.2.06 కోట్లు విలువైన బంగారం నగలు, రూ.2.67 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు. రన్యా రావు గతంలో మాణిక్య, పటాకీ వంటి కన్నడ సినిమాల్లో నటించారు. ఆ తరువాత స్మగ్లింగ్ వైపు ఎలా మళ్లారనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Read Latest and National News

Updated Date - Mar 07 , 2025 | 01:16 PM