Assam: అసోంలో రూ. 50వేల కోట్ల పెట్టుబడులకు అదానీ గ్రూప్ శ్రీకారం
ABN , Publish Date - Apr 14 , 2025 | 03:51 PM
'సెవెన్ సిస్టర్స్'గా పిలుచుకునే భారత ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారం అసోం(అస్సాం) రాష్ట్రం. భూటాన్, బంగ్లాదేశ్ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉన్న ఈ రాష్ట్రం..

'సెవెన్ సిస్టర్స్'గా పిలుచుకునే భారత ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారం అసోం(అస్సాం) రాష్ట్రం. భూటాన్, బంగ్లాదేశ్ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉన్న ఈ రాష్ట్రం హిమాలయ పర్వత సానువుల అందాలతో అలరారుతూ ఉంటుంది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అసోంను ఆర్థికంగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ఇటీవలి కాలంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగానే ఫిబ్రవరిలో 'అడ్వాంటేజ్ అస్సాం 2.0'(#AdvantageAssam2) వ్యాపార సదస్సు(Business Summit)నిర్వహించారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి మంచి ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్ర ప్రగతిలో పాలు పంచుకోవాలని వ్యాపార వేత్తలకు పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమ ఫలాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా అందుతున్నాయి.
'అడ్వాంటేజ్ అస్సాం 2.0' సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై ప్రసంగించిన అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ రాష్ట్రంలోని వివిధ రంగాలలో రూ. 50,000 కోట్లు పెట్టుబడి పెడతామని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు కార్యాచరణకు దిగారు. ఇందులో భాగంగా అస్సాం ముఖ్యమంత్రిని అదానీ కుమారుడు, సంస్థ డైరెక్టర్ జీత్ అదానీ కలిశారు. రాష్ట్రంలో రూ. 50,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనల అమలుపై చర్చించారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన ఎక్స్(X)ఖాతాలో పోస్ట్ చేశారు. వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి అదానీ గ్రూప్ ఇచ్చిన ప్రతిపాదనలు త్వరలో వాస్తవరూపం దాలుస్తాయని శర్మ చెప్పారు.
"#AdvantageAssam2 సమయంలో, అదానీ గ్రూప్ రూ. 50,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. ఇందులో భాగంగా ఈరోజు నా సీనియర్ అధికారులతో పాటు అదానీ గ్రూప్ డైరెక్టర్ శ్రీ జీత్ అదానీ ఇంకా అతని బృందంతో లోతైన చర్చలు జరిపాం" అని సీఎం సదరు పోస్ట్‌లొ వెల్లడించారు. "ఏరో-సిటీ, హోటళ్ళు, సిమెంట్ ప్లాంట్ ఇంకా కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అభివృద్ధి చేయడంలో గణనీయమైన పెట్టుబడులకు సంబంధించి మేము సంతకం చేసిన అవగాహన ఒప్పందాలు త్వరలో ప్రారంభమవుతాయని ఆశిస్తున్నాము" అని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
Unseasonal Rains Damage: చేతికొచ్చిన పంట నేలరాలింది.. అన్నదాత కంట కన్నీరు
Falaknuma Crime News: వివాహమైన మూడు రోజులకే రౌడీషీటర్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే
Read Latest AP News And Telugu News