Fine Rice Distribution: తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభం
ABN, Publish Date - Apr 01 , 2025 | 11:13 AM
Fine Rice Distribution: రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తారు. సన్న బియ్యం పంపిణీ ద్వారా పేదలకు మరింత లాభం చేకూరనుంది.
ఉగాది పండుగను (మార్చి 30) పురస్కరించుకుని హూజూర్‌నగర్ వేదికగా రేషన్ కార్డుదారులకు ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు.
ఏప్రిల్ 1 అంటే నేటి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైంది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్‌లో సన్న బియ్యం పంపిణీని మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ తాహెర్బిన్ హందాన్ ప్రారంభించారు.
ఇప్పటి వరకు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యాన్నీ పంపిణీ చేసేవారు. ఇకపై దొడ్డుబియ్యం స్థానంలో సన్న బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు.
గత ఖరీఫ్‌లో వచ్చిన పంటను రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది
దాదాపు 24 లక్షల టన్నుల వడ్లను ప్రభుత్వం సేకరించి.. వాటిని మిల్లింగ్ చేయించి పేదలకు పంపిణీ చేస్తోంది
ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేస్తారు.
లబ్దిదారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు
Updated Date - Apr 01 , 2025 | 11:13 AM