Artificial Intelligence: ఏఐ ఏం చేయగలదో చూడండి.. ఓ వ్యక్తి నిద్రపోతున్న సమయంలో ఏం జరిగిందంటే..
ABN, Publish Date - Jan 10 , 2025 | 05:08 PM
డిజిటల్ రంగంలో ఏఐ పరిధి వాయు వేగంతో పెరుగుతోంది. మొబైల్ ఫోన్లలో అందుబాటులోకి వస్తున్న ఏఐ చాలా పనులను సులభతరం చేస్తోంది. ఏఐ చాట్‌బాట్‌ల సాయంతో చాలా పనులు సులభంగా జరిగిపోతున్నాయి.
ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) క్రమక్రమంగా విస్తరిస్తోంది. ఏఐ (AI) అందుబాటులోకి వచ్చిన తరువాత అనేక అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతానికి డిజిటల్ రంగంలో ఏఐ పరిధి వాయు వేగంతో పెరుగుతోంది. మొబైల్ ఫోన్లలో అందుబాటులోకి వస్తున్న ఏఐ చాలా పనులను సులభతరం చేస్తోంది. ఏఐ చాట్‌బాట్ (AI bot)ల సాయంతో చాలా పనులు సులభంగా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా అభ్యర్థులు ఏఐ సహాయంతో సీవీలు, రెజ్యూమ్‌ల (Resume)ను అద్భుతంగా తయారు చేసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఉద్యోగాలకోసం దరఖాస్తు చేయగల ఏఐ బాట్ ను రూపొందించాడు (Viral News).
ఆ యువకుడు రూపొందించిన ఏఐ బాట్ ఉద్యోగార్హతలను విశ్లేషించి, అందుకు తగిన విధంగా అప్లికేషన్లు (AI job applications) రూపొందించింది. అతడు రాత్రి నిద్రపోయి ఉదయం లేచే లోపు ఏకంగా వెయ్యి సంస్థలకు అతడి రెజ్యూమ్‌లను పంపించేసింది. అందులో 50 సంస్థల నుంచి తనకు ఇంటర్వ్యూ లెటర్‌లు వచ్చాయని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. అయితే ఆ వ్యక్తి తన పేరు, ఇతర వివరాలను వెల్లడించలేదు. అయితే అతడు వెల్లడించిన విషయాలు మాత్రం చాలా మందికి ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ టెక్నాలజీ డిజిటల్ రంగంలో సరికొత్త విప్లవం అని చాలా మంది భావిస్తున్నారు.
ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఏఐ బాట్ స్వయంగా సీవీని సిద్ధం చేసి కవర్ లెటర్‌తో పాటు సంబంధిత కంపెనీలకు పంపుతుంది. ఆటోమేటెడ్ స్క్రీనింగ్ సిస్టమ్ ద్వారా ఈ ప్రక్రియను చాలా ప్రభావవంతంగా, వేగంగా చేయగలుగుతుందని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఈ టెక్నాలజీ ద్వారా మనుషుల ప్రమేయం, క్రియేటివిటీకి ప్రాధాన్యం తగ్గిపోతుందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానవ మేథను ఈ టెక్నాలజీ సంకోచింపచేస్తుందని కొందరు ఆందోళన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఏనుగును చూసి కుక్క మొరిగితే ఏమవుతుంది? ఈ వీడియో చూస్తే తెలుస్తుంది..
Starbucks: స్టార్‌బక్స్ లోగో ఏంటో తెలుసా? దాని వెనుక ఉన్న ఆసక్తికర కథ ఏంటంటే..
Viral Video: ఈ ఏనుగు ఎంత మంచిది.. ఎన్‌క్లోజర్‌లో కుర్రాడి చెప్పు పడిపోతే ఏం చేసిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 10 , 2025 | 05:08 PM