Gold Buying Tips: మొదటిసారి బంగారం కొంటున్నారా? తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏవంటే..
ABN , Publish Date - Apr 10 , 2025 | 03:55 PM
మార్కెట్‌లో వివిధ రకాల స్వచ్ఛతతో కూడిన బంగారు నగలు ఉన్నాయి. ఎవరికి ఏ ఏది సరైనదో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: గతంలో బంగారు నగల షాకింగ్ ట్రెండ్ భిన్నంగా ఉండేది. అందరూ 22 క్యారెట్ నగలు కొనుక్కునే వారు. మేలిమి బంగారం గురించి కొంతమందికి ఐడియా ఉన్నా 18 క్యారెట్, 14 క్యారెట్ల బంగారం గురించి చాలా మందికి తెలిసేది కాదు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. వినియోగదారుల అవగాహనలో మార్పు కారణంగా అన్ని రకలా స్వచ్ఛతలు కలిగిన బంగారు ఆభరణాలను జనాలు కొనుగోలు చేస్తున్నారు. మారుతున్న జనాల అభిరుచులకు చిహ్నంగా జువెలరీ షాపింగ్ ట్రెండ్‌లోనూ మార్పు కనిపిస్తోంది. కేవలం స్వచ్ఛత, బరువుతో పాటు డిజైన్ విషయంపై కూడా వినియోగదారులు దృష్టి పెడుతున్నారు. ఏ స్వచ్ఛత ఉన్నది కొనాలి అనే విషయంపై నిపుణులు పలు రకాలు సూచనలు కూడా చేస్తున్నారు (Gold Buying Guide).
నిపుణులు చెప్పేదాని ప్రకారం, బంగారం కొనేవారు ముందుగా చూడాల్సింది దాని స్వచ్ఛతే. దీన్ని క్యారెట్‌లల్లో కొలుస్తారు. నగలలో బంగారంతో పాటు ఇతర లోహాలు ఏమేర ఉన్నాయో ఇది చెబుతుంది. ఉదాహరణకు 22 క్యారెట్ల బంగారు నగలో 91.6 శాతం బంగారం, మిగతా 8.4 శాతం ఇతర లోహాలు ఉంటాయి. ఇక18 క్యారెట బంగారం స్వచ్ఛత 75 శాతం. ఇక పెట్టుబడి కోసం బంగారం కొనాలనుకునే వారు 24 క్యారెట్‌లు కొనడమే మంచిది. అయితే, 18 క్యారెట్ బంగారు నగకు మన్నిక ఎక్కువ. చాలా కాలం పాటు ఎటువంటి లొపాలు లేకుండా ఉంటుంది.
ఇక బంగారు నగ బరువు పెరిగే కొద్దీ దాని విలువ కూడా పెరుగుతుంది. అయితే, అధిక బరువున్న 18కే బంగారం కంటే తక్కువ బరువున్న 2 బంగారానికే విలువ ఎక్కువన్న విషయం గుర్తించాలి.
బంగారం ధరలు కేవలం గోల్డ్ మార్కెట్లపైనే ఆధార పడి ఉండవు. తయారీ చార్జిలు, తరుగు, డిజైన్ వంటి అనేక రకాల ఖర్చులు మీద పడతాయి. ఇక డిజైన్‌లు ఎక్కువగా ఉన్న బంగారం నగల ధలు ఎక్కువ. ఈ డిజైనర్ నగలు తక్కువగా లభిస్తుండటమే ఇందుకు కారణం. అత్యధిక నైపుణ్యంతో వీటిని తయారు చేస్తారు కాబట్టి ఆ మేరకు ధరల్లో కూడా మార్పులు కనిపిస్తాయి.
కాబట్టి, భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడిగా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు స్వచ్ఛతకే పెద్దపీట వెయ్యాలి. ఎవరికైనా బహుమతిగా బంగారం ఇవ్వాలనుకుంటే మాత్రం స్వచ్ఛతతో పాటు, బరువు, ధర వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి:
మాజీ బాయ్‌ఫ్రెండే కాబోయే మామగారు.. యువతి లైఫ్‌లో వింత ట్విస్ట్
తల్లి హృదయం ఎంత గొప్పది.. చిరుత దాడిలో గాయపడ్డా లెక్క చేయక ఈ తల్లి శునకం..
రూల్స్‌కు విరుద్ధంగా చీతాల దాహం తీర్చినందుకు అటవీ శాఖ సిబ్బందిపై వేటు