Teacher`s Whisky: టీచర్స్ విస్కీకి ఆ పేరెలా వచ్చిందో తెలుసా? దాని వెనుకున్న 175 ఏళ్ల చరిత్ర ఏంటంటే..
ABN, Publish Date - Jan 12 , 2025 | 10:07 AM
విస్కీ, రమ్, బీర్.. ఇలా రకరకాల రూపాలలో ఆల్కహాల్ లభ్యమవుతుంది. అయితే వీటిల్లో ఎక్కువ మంది విస్కీనే ఇష్టపడతారు. విస్కీలో టీచర్స్ విస్కీకి ఎంతో మంది అభిమానులున్నారు. అసలు ఆ టీచర్స్ విస్కీకి ఆ పేరెలా వచ్చింది? అది మన దేశంలోకి ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న 175 ఏళ్ల చరిత్ర గురించి తెలుసుకుందాం..
ఆల్కహాల్ (Alcohol) ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. అయినా మద్యం తాగే వారి సంఖ్య తగ్గడం లేదు. భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా మద్యానికి విపరీతమైన గిరాకీ. విస్కీ, రమ్, బీర్.. ఇలా రకరకాల రూపాలలో ఆల్కహాల్ లభ్యమవుతుంది. అయితే వీటిల్లో ఎక్కువ మంది విస్కీ (Whisky)నే ఇష్టపడతారు. విస్కీలో టీచర్స్ విస్కీకి ఎంతో మంది అభిమానులున్నారు. అసలు ఆ టీచర్స్ విస్కీకి ఆ పేరెలా వచ్చింది? అది మన దేశంలోకి ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న 175 ఏళ్ల చరిత్ర గురించి తెలుసుకుందాం (Teacher's Whisky)..
స్కాట్లాండ్ (Scotland)లోని ఒక యువకుడు 1830లో ఆ విస్కీని స్వయంగా తయారు చేసుకున్నాడు. తన కోసమే ఆ విస్కీని తయారు చేసుకున్నాడు. ఆ రుచి అతడి స్నేహితులు, బంధువులకు కూడా నచ్చింది. దీంతో దానిని స్థానికంగా విక్రయించడం ప్రారంభించాడు. క్రమంగా ఆ విస్కీ స్కాట్లాండ్ వ్యాప్తంగా ఆదరణ పొందింది. 1860లో స్పిరిట్స్ చట్టం కింద నమోదై ``టీచర్స్`` పేరుతో బ్రాండ్‌గా మారింది. 1830లో ఆ విస్కీని తయారు చేసిన ఆ యువకుడి పేరు విలియం టీచర్స్ (William Teacher). అతడి పేరుతోనే ఆ బ్రాండ్ ప్రారంభమైంది. టీచర్స్ విస్కీ అనేది భారతదేశంలో విక్రయించిన మొట్ట మొదటి అంతర్జాతీయ విస్కీ బ్రాండ్.
విలియం టీచర్ మరణం తరువాత, అతని కుమారులు తండ్రి వ్యాపారాన్ని కొనసాగించారు. ఆ కంపెనీ పేరును ``విలియం టీచర్ అండ్ సన్స్ లిమిటెడ్``గా మార్చారు. నేడు టీచర్స్ విస్కీ భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో అమ్ముడవుతోంది. ఈ విస్కీ భారతదేశంలోని ప్రీమియం బ్రాండ్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. టీచర్స్ విస్కీ ఫుల్ బాటిల్ ధర రూ.1700 నుంచి రూ.2000 మధ్యన ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: స్వర్గంలో ప్రయాణం.. 4 వేల కి.మీ. జర్నీ.. రూ. 1.5 లక్షల టిక్కెట్.. ఎక్కడో తెలుసా?
Optical Illusion Test: వర్షం పడుతోంది.. ఈ పిల్లల గొడుగు ఎక్కడుందో 5 సెకెన్లలో గుర్తించి చెప్పండి..
Viral Video: ఇది మామూలు ఫైట్ కాదు.. పాము-ముంగిస పోరాటం చూశారా? చివరకు ఏం జరిగిందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 12 , 2025 | 10:07 AM