Share News

Five Numbers Mobile No: ఐదంకెల ఫోన్ నెంబర్.. మీరు తీసుకోవాలనుకుంటున్నారా

ABN , Publish Date - Apr 05 , 2025 | 10:03 AM

మొబైల్ నెంబర్‌లో ఎన్ని డిజిట్స్ ఉంటాయంటే సాధారణంగా పది అనే సమాధానం వినిపిస్తుంది. కానీ ఈ అంకెలు దేశాన్ని బట్టి మారుతుంటాయి. ఏ దేశంలో ఎన్ని డిజిట్స్ నెంబర్లు ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం

Five Numbers Mobile No: ఐదంకెల ఫోన్ నెంబర్.. మీరు తీసుకోవాలనుకుంటున్నారా
Mobile Numbers

మొబైల్ నెంబర్ అనగానే మనకు గుర్తొచ్చేది 10 అంకెలు సాధారణంగా కంట్రీ కోడ్‌ కాకుండా భారత్‌లో పది అంకెల మొబైల్ నెంబర్లే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. దేశంలోకి మొబైల్స్ వచ్చిన కొత్తలో 8 అంకెలు ఉన్నప్పటికీ తర్వాత కాలంలో మొబైల్ వినియోగం పెరిగే సమయానికి పది అంకెల నెంబర్లే అందుబాటులోకి వచ్చాయి.


దేశ జనాభా ఆధారంగా ఈ మొబైల్ నెంబర్‌లో ఎన్ని సంఖ్యలు ఉండాలనేది నిర్ణయిస్తారు. ఒకవేళ తక్కువ నెంబర్లు ఉంటే వాటితో సృష్టించగల సంఖ్యలు తక్కువుగా ఉంటాయి. అదే పది సంఖ్యల నెంబర్‌తో దాదాపు వెయ్యి కోట్ల నెంబర్లు సృష్టించవచ్చనేది ఒక అంచనా. చైనాలోనూ జనాభా ఎక్కువకావడంతో అక్కడ కూడ 11 అంకెల మొబైల్ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. బ్రెజిల్‌లో కూడా 11 అంకెల మొబైల్ నెంబర్ ఉంది. ఇక అమెరికా, భారత్, యూకేలో పది అంకెల నెంబర్లు ఉన్నాయి. మరి ఐదంకెల నెంబర్లు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి. అక్కడ ఐదంకెలు ఉండటానికి కారణాలు తెలుసుకుందాం.


జనాభా ఆధారంగా

మొబైల్ నెంబర్లలో ఎన్ని అంకెలు ఉండాలనేది ఆ దేశ జనాభాపై ఆధారపడి ఉంటుంది. దేశ జనాభా, టెలికాం వ్యవస్థ, చారిత్రాక అవసరాల ఆధారంగా మొబైల్ నెంబర్ల పొడవు మారుతూ ఉంటుంది. ఐదు నుంచి ఆరు అంకెల మొబైల్ నెంబర్లు ఉన్న దేశాలు ప్రపంచంలో కొన్ని ఉన్నాయి. జనాభా తక్కువ, టెలిఫోన్ వినియోగం పరిమితంగా ఉన్న దేశాలలో మొబైల్ నెంబర్ల పొడవు తక్కువుగా ఉంటుంది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఒక దేశంలోని ఫోన్ నెంబర్ కంట్రీ కోడ్‌తో కలిపి గరిష్టంగా 15 అంకెలు ఉండాలి. కానీ దేశంలోని వినియోగదారుల ఆధారంగా ఈ అంకెల నిడివి మారుతుంది.


ఏయే దేశాల్లో

దక్షిణ అట్లాంటిక్ దీవిలోని సెయింట్ హెలెనాలో మొబైల్, ల్యాండ్ ఫోన్ నెంబర్లు ఐదు అంకెలతో ఉంటాయి. ఈ దీవిలో జనాభా దాదాపు 4,500 మంది మాత్రమే. గతంలో నాలుగు అంకెలు ఉండే ఇక్కడి నెంబర్లను ప్రస్తుతం ఐదుకి మార్చారు. టోకెలావ్ అనే పసిఫిక్ దీవుల్లో జనాభా 2వేల మందిలోపు ఉంటారు. ఇక్కడ ఆరు అంకెల మొబైల్ నెంబర్లు ఉన్నాయి. యూరోపియన్ దేశాల్లో ఒకటైన ఆండోరాలో జనాభా 77వేల మది మాత్రమే. ఇక్కడ కూడా ఆరు అంకెల మొబైల్ నెంబర్లు ఉన్నాయి. సన్ మారినోలో ఆరు అంకెల మొబైల్ నెంబర్లు ఉన్నాయి. తాన్జానియాలో గతంలో ఆరు అంకెల నెంబర్లు ఉండగా ప్రస్తుతం 9 అంకెలకు మార్చారు.


కారణాలు

ఐదు లేదా ఆరు అంకెల మొబైల్ నెంబర్లు ఉండటానికి ప్రధాన కారణం జనాభా తక్కువుగా ఉండటం. ఐదు అంకెలతో పది వేల విభిన్న నెంబర్లు ఆరు అంకెలతో లక్ష నెంబర్లు సృష్టించవచ్చు. పది అంకెలతో వెయ్యి కోట్ల నెంబర్లు సృష్టించే అవకాశం ఉంది. అందుకే పది వేలకంటే జనాభా తక్కువుగా ఉన్న ప్రాంతాల్లో ఐదు నుంచి ఆరు అంకెల నెంబర్లు అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

Axis Power Deal: జగన్‌ బాటలోనే చంద్రబాబు

YS Sharmila vs Jagan: మోసగాడు ఈ మేనమామ

Kasireddy Rajasekhar Reddy: కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టు షాక్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 05 , 2025 | 10:03 AM